Menu Close

Ghallu Ghallu Song Lyrics In Telugu – Swarna Kamalam


ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే యెరగని వేగంతో వెళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

లయకే నిలయమై నీ పాదం సాగాలి… ఆహహ హహా
మలయానిలగతిలో సుమబాలగా తూగాలి… ఆ ఆహ ఆ ఆహ
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడీ..?
తిరిగే కాలానికీ… ఆ ఆఆ ఆఆఆ
తిరిగే కాలానికి తీరొకటుందీ… అది నీ పాఠానికి దొరకను అందీ
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సురగంగకు విలువేముందీ?… విలువేముందీ?
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

దూకే అలలకూ ఏ తాళం వేస్తారూ… ఆహా హా ఆ హా
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు… మ్మ్ మ్మ్ మ్మ్
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్థం?
వద్దని ఆపలేరు… ఆఆ ఆ ఆ ఆఆ
వద్దని ఆపలేరు ఉరికే ఊహనీ
హద్దులు దాటరాదు ఆశల వాహినీ
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముందీ?… విలువేముందీ?

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading