Types of Namaskar(Greetings): నమస్కారములు చాలా విధములు అందు అతి ముఖ్యమైనవి నాలుగు.
1. సాష్టాంగ నమస్కారము:-
ఏడు శరీరాంగములు + మనసు కలిపి ఎనిమిది అంగములు.
ఈ ఎనిమిది అంగములు భూమికి తగిలేలా బోర్లాపడి నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము.
“ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తధా,
పద్భ్యాం కరాభ్యామ్, కర్ణాభ్యామ్, ప్రణామోస్థాంగముచ్యతే”
1. కాళ్ళు, 2. చేతులు, 3. ముక్కు , 4. చెవులు, 5. ఉదరము, 6. కళ్ళు, 7. నోరు, 8. మనస్సు.
ముఖ్యగమనిక :- స్త్రీలు మాత్రము ఈ సాష్టాంగ నమస్కారము చేయరాదు అని వేదములు నొక్కి వక్కాణిస్తున్నాయి. స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారము మాత్రమే చేయాలి.
ఆడవారు ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక వున్న అసలు రహస్యం – Gorintaku Uses and Benefits
2. పంచాంగ నమస్కారము :-
పంచాంగములు: 1. అరి చేతులు, 2. మోకాళ్ళు, 3. మోచేతులు, 4. పాదములు, 5. శిరస్సు.
3. అభివాద నమస్కారము:-
ప్రవరతోటి చేయు నమస్కారము. అభివాద నమస్కారము నిలబడి చేయరాదు. పూర్తిగా వంగి పాదముల మీద చేతులు ఉంచి మెల్లగా లేచి నమస్కారము చేయాలి.
గురువుగార్లను, ఆచార్యదేవులను, వేదపండితులను, నిత్యాగ్నిహోత్రులను, వయో వృద్దులను, జ్ఞానవృద్దుల ను దర్శించినపుడు లేదా వారి దగ్గరకు వెళ్ళినపుడు విధిగా అభివాద నమస్కారము చేయాలి.
4. ప్రణిపాతము:- ఆర్తితో చేయు నమస్కారము.
నేలమీదపడి నమస్కారము చేయడము.
“మాహృదయ క్షేత్రాలలో ‘భక్తి,’ అనే బీజాలను నాటండి. దీనిని మనస్సు అనే నీటితో తడపండి. దానికి నాలుగు దిక్కుల ‘సంత్సంగం’ అనే కంచె వేయండి. దానివలన ‘కామాది వికృతరూప, పశువులు’ రాకుండా ఉంటాయి.
Telugu greeting gestures
Traditional Telugu greetings
Namaskaram variations in Telugu
Telugu greetings and their meanings
Popular Telugu greetings
Telugu cultural greetings
Telugu greeting customs
Telugu salutations
Telugu greetings etiquette
Telugu greeting phrases
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.