Menu Close

Naluguriki Nachinadi Lyrics In Telugu – Takkari Donga – నలుగురికి నచ్చినది లిరిక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Naluguriki Nachinadi Lyrics In Telugu – Takkari Donga – నలుగురికి నచ్చినది లిరిక్స్

నలుగురికి నచ్చినది… నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది… ఆ రూట్లో నే నడిచెదరో
నలుగురికి నచ్చినది… నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది… ఆ రూట్లో నే నడిచెదరో

పొగరని అందరు అన్నా… అది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా… అది నాలో మేనరిజం
నిండు చందురుడు ఒక వైపు… చుక్కలు ఒక వైపు
నేను ఒక్కడిని ఒక వైపు… లోకం ఒక వైపు
నిండు చందురుడు ఒక వైపు… చుక్కలు ఒక వైపు
నేను ఒక్కడిని ఒక వైపు… లోకం ఒక వైపు

నలుగురికి నచ్చినది… నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది… ఆ రూట్లో నే నడిచెదరో

నువ్వు నిలబడి నీళ్ళు తాగడం… నథింగ్ స్పెషల్
పరుగులెత్తుతూ పాలూ తాగడం… సంథింగ్ స్పెషల్
నిన్ను అడిగితే నిజం చెప్పడం… నథింగ్ స్పెషల్
అప్పుడప్పుడు తప్పు చెప్పడం… సంథింగ్ స్పెషల్
లేనివాడికి దానమివ్వడం… నథింగ్ స్పెషల్
ఓ లేనివాడికి దానమివ్వడం… నథింగ్ స్పెషల్
ఉన్నవాడిది దోచుకెళ్ళడం… సంథింగ్ స్పెషల్

నలుగురికి నచ్చినది… నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది… ఆ రూట్లో నే నడిచెదరో

బుద్దిమంతుడి బ్రాండు దక్కడం… నథింగ్ స్పెషల్
పోకిరోడిలా పేరుకెక్కడం… సంథింగ్ స్పెషల్
రాజమార్గమున ముందుకెళ్ళడం… నథింగ్ స్పెషల్
దొడ్డిదారిలో దూసుకెళ్ళడం… సంథింగ్ స్పెషల్
హాయి కలిగితే నవ్వు చిందడం… నథింగ్ స్పెషల్
హాయి కలిగితే నవ్వు చిందడం… నథింగ్ స్పెషల్
బాధ కలిగినా నవ్వుతుండడం… సంథింగ్ స్పెషల్

నలుగురికి నచ్చినది… నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది… ఆ రూట్లో నే నడిచెదరో

పొగరని అందరు అన్నా… అది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా… అది నాలో మేనరిజం
నిండు చందురుడు ఒక వైపు… చుక్కలు ఒక వైపు
నేను ఒక్కడిని ఒకవైపు… లోకం ఒకవైపు
నిండు చందురుడు ఒకవైపు… చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు… లోకం ఒకవైపు.. ..

SUBSCRIBE FOR MORE

Naluguriki Nachinadi Lyrics In Telugu – Takkari Donga – నలుగురికి నచ్చినది లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading