ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Naa Neethi Suryuda Lyrics In Telugu – Telugu Christian Songs
నా నీతి సూర్యుడా… భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో… ఘనులైన వారిని
నా నీతి సూర్యుడా… భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో… ఘనులైన వారిని
రాజులకే రారాజువు… కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా… కాపాడే కాపరివి
నా నీతి సూర్యుడా… భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో… ఘనులైన వారిని
శ్రమలలో బహు శ్రమలలో… ఆదరణ కలిగించెను
వాక్యమే కృపా వాక్యమే… నను వీడని అనుబంధమై
శ్రమలలో బహు శ్రమలలో… ఆదరణ కలిగించెను
వాక్యమే కృపా వాక్యమే… నను వీడని అనుబంధమై
నీ మాటలే జల ధారాలై… సంతృప్తి నిచ్చెను
నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను
నీ మాటే మధురమ్
రాజులకే రారాజువు… కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా… కాపాడే కాపరివి
మేలుకై సమస్తమును… జరిగించుచున్నావు నీవు
యేదియు కొదువ చేయవు… నిన్నాశ్రయించిన వారిని
మేలుకై సమస్తమును… జరిగించుచున్నావు నీవు
యేదియు కొదువ చేయవు… నిన్నాశ్రయించిన వారిని
భీకరమైన కార్యములు చేయుచున్నవాడ
సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్న వాడ, ఘనపరతును నిన్నే
ప్రేమించే యేసయ్యా… నీవుంటే చాలునయ
నడిపించే నజరేయుడా… కాపాడే కాపరివి ||నా నీతి సూర్యుడా||
సంఘమై నీ స్వాస్థ్యమై… నను నీ ఎదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో… నను ముద్రించియున్నావు నీవు
సంఘమై నీ స్వాస్థ్యమై… నను నీ ఎదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో… నను ముద్రించియున్నావు నీవు
వరములతో ఫలములతో… నీకై బ్రతకాలని
తుదిశ్వాశ నీ సన్నిధిలో… విజయం చూడాలని, ఆశతో ఉన్నానయ
కరుణించే యేసయ్యా… నీ కోసమే నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలని… నిను చూసే ఆ క్షణం రావాలయ్యా
నా నీతి సూర్యుడా… భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో… ఘనులైన వారిని
Naa Neethi Suryuda Lyrics In Telugu – Telugu Christian Songs