ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Na manasuku praanam posi Lyrics in Telugu – Aadavari Matalaku Ardhale Verule
నా మనసుకు ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి ఓఓ..(2)
నా వయసుకి వంతెన వేసి
నా వలపుల వాకిలి తీసి
మది తెర తెరిచి ముగ్గే పరిచి
ఉన్నావు లోకం మరిచి(నా మనసుకి)
నీ చూపుకి చంద్రుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే
నీ చొరవకి నీ చెలిమికి
మొదలయే మాయే మాయే
నీ అడుగుకు ఆకులు పువులాయే
నీ కులుకుకి కాకులు కవులాయే
నీ కలలకి నీ కథలకి కదలాడే హాయే హాయే
అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి
నా మనసనే ఒక సరస్సులో
అలజడులే సృష్టించావే.. (నా మసుకి)
ఒక మాట ప్రేమగా పలకలే
ఒక అడుగు జతపడి నడవాలే
ఆ గురుతులు నా గుండెలో
ప్రతి జన్మకు పదిలం పదిలం
ఒక సారి ఒడిలో ఒదగాలే
ఎద పైన నిదురే పోవాలె
తీయ తీయని నీ స్మృతులతో
బ్రతికేస్తా నిమిషం నిమిషం
నీ ఆశలు గమనించాలి నీ ఆర్ద్రత గుర్తించాలి
ఎటు తేలక బదులీయక
మౌనంగా చూస్తుండాలి