Menu Close

తప్పక చదవాల్సిన కథ – Must Read Telugu Stories

Must Read Telugu Stories

ఒక తల్లి తన కుమారునికి వీడియో
చాట్ లో జరిగిన సంభాషణలు మన కోసం.

తల్లి, నాయనా! పూజా పునస్కారాలు ఐనాయా?
కుమారుడు ఇలా చెప్పారు.
అమ్మా!నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా
అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి
అన్వేషణ(రీసెర్చ్) చేస్తున్నాను.

మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు.
అలాంటి నేను పూజలు చేస్తూ కూర్చుంటే ఏం
బాగోదు.

తల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్
గురించి కొద్దిగా తెలుసు కన్నా. కానీ అతను
కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో
ఉన్నవే కదా నాన్నా అన్నది.
కుమారుడు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు
తెలీదే అని అన్నాడు. అపుడు ఆ తల్లి నీకు
అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం
మృదువుగా తన సంభాషణ కొనసాగించింది.
నీకు మహా విష్ణువు యొక్క దశావతారాల
గురించి తెలుసు కదా.

కుమారుడు ఆసక్తిగా అవును తెలుసు దానికి
ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం అని
ప్రశ్నించాడు.
అప్పుడు ఆ తల్లి సంబంధం ఉంది. ఇంకా
నువ్వు, నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా
చెపుతాను విను.

1 మత్స్య అవతారం: అది నీటిలో ఉంటుంది.
అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది.
ఇది నిజమా కాదా. కొడుకు కొంచెం అలెర్ట్ గా
వింటున్నాడు.
2 కూర్మ అవతారం: అంటే తాబేలు.దీనిని బట్టి సృష్టి
నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా
గమనించాలి. అంటే ఉభయచర జీవులు లాగా.
తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం
జరిగింది.

3 వరాహ అవతారం: అంటే పంది. ఇది అడవి
జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే
డైనోసార్లని గుర్తుకు తెస్తుంది.

4 నృసింహ అవతారం: అంటే సగం మనిషి, సగం
జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి
జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు
ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.

5 వామన అవతారం: అంటే పొట్టివాడు అయినా
ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు. నీకు తెలుసుకదా
మానవులు మొదట హోమో erectes మరియు
హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో
హోమో సేపియన్స్ మనుషులు గా వికాసం చెందారు.
కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.

6 పరశురామ అవతారం: ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని
పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే
ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు
తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు,
గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి
ఆటవిక న్యాయం కలిగినవాడు.

7 రామావతారం: మర్యాద పురుషోత్తముడైన రాముడు
మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను
సమాజానికి నీతి నియమాలు . సమస్త కుటుంబ
బంధుత్వానికి ఆది పురుషుడు.

8 కృష్ణ పరమాత్మ అవతారము.. రాజనీతిజ్ఞుడు, పాలకుడు, ప్రేమించే స్వభావి. అతడు సమాజ నియమాలను
ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో
తెలిపినవాడు. వాటితో సమాజములో వుంటూ
సుఖ దుఃఖ లాభ నష్టాలు అన్ని నేర్పినవాడు.
కొడుకు ఆశ్చర్యం, విస్మయంతో వింటున్నాడు.
ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ

9 బుద్ధ అవతారం: ఆయన నృసింహ అవతారం నుండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటూ చేసే ఆవిష్కరణలకు మూలం.

10 కల్కి అవతారం: అతను నీవు ఏ మానవునికై
వేతుకుతున్నావో అతనే ఇతను. అతను ఇప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన
వ్యక్తిగా వెలుగొందుతాడు.
కుమారుడు తన తల్లివంక అవాక్కయి చూస్తున్నాడు.
అప్పుడు ఆ కుమారుడు ఆనంద భాష్పాలతో అమ్మా!
హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన నిజమైన ధర్మం.
అని అన్నాడు,

darvin, dasavatharalu

ఆత్మీయులారా!
మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు,
ఇత్యాది అన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం
చూసే దృష్టి కోణం మారాలి. మీరు ఎలా అనుకొంటే
అలా వైజ్ఞానికమైనవి కావచ్చు. లేదా ధర్మ పరమైనవి
కావచ్చు. శాస్త్రీయతతో కూడిన ధర్మాన్ని నేడు
మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే
అపహాస్యం చేసుకొంటున్నాం.

దానికి కారణం లేక పోలేదు, మన ధర్మాలను ఎందుకు అసలు పాటించాలి అనే ప్రశ్నకు సామదానం చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల, మన శాస్త్రీయత దానికి వెనుక కారణాలను తెలుసుకోని మన తల్లి,తండ్రులు వారి తల్లి తండ్రుల వల్ల.

నేటి తరం ప్రశ్నిచడం వల్ల చాలా వరకు కారణాలు తెలుస్తున్నాయి, దానికి నిజంగా మనం సంతోషించాలి.

Like and Share
+1
1
+1
0
+1
2
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks