Menu Close

Muddula Rajalo Koduka Lyrics In Telugu – Folk Song

Muddula Rajalo Koduka Lyrics In Telugu – Folk Song

ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ
సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
ఎక్కడున్నా రాజాలు నువు సుఖంగుండు రాజాలు
ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ

సేసుకోని బతుకుతమని సెల్కాల్లా బోర్లేస్తే
అప్పులోతు ఎక్కువాయే సుక్క నీళ్లు ఎల్లకపాయే
కాలము కరకరమని కడుపూ మీదా కొట్టీపాయే
అప్పులొడ్డి తాళలేక అయ్య ఆత్మ సచ్చిపాయే

ఏడు తిరగక ముందే ఊరు ఇడిసినవ్రా కొడుకా
పట్నంలో పనిజేసి పైసా పైసా పంపిస్తివి
చిన్నానాడురో కొడుక సీతా కష్టంరో బిడ్డ
చింతా చెందకురో కొడుక… సిక్కిపోతవో బిడ్డా
సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ
సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
ఎక్కడున్నా రాజాలు నువు సుఖంగుండు రాజాలు

ఇల్లిడిసి నువు పోయి ఏడాదినర్ధమాయే
ఉన్న కూలి కన్నా కూలి సేసి కాలం గొలిపిస్తి
పైస పైస పోగు జేసి అయ్యా సావు బాకీ తీర్చినవ్
బియ్యము నూకలు లేక తిప్పలొచ్చినాయి కొడుక
కంటికి పుట్టెడురో కొడుక కష్టాలున్నయిరో బిడ్డో
ఎప్పూడొస్తవో కొడక ఎట్లా జెప్పుదురో బిడ్డ
సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు

నెత్తిన అక్షింతలేస్తె పచ్చని సంసారమగును
మనవళ్ళనెత్తుకొని ముద్దాడ నోచుకోలే
గూడుచెదిరిన పక్షులోలే చెట్టుకొకరమైనాము
దేవునింట్ల మన్నుపొయ్య ఈసమన్న సాయం కాలే
ఏమి రాతలురో కొడుక ఏట్లో ఈతలురో బిడ్డ
బాటా దొరకని కొడక బోయిల మైతిమో బిడ్డా
సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు

ఎండల్ల కూళ్ళుజెయ్య వరి కోతకు నేను పోతే
సేతగాని పానమాయె అలిపిరొస్తే కూసుంటి
నెత్తురు సచ్చి ఒంట్లో సత్తువ కరువైందిర
దమ్మారా నీళ్లు తాగి వరిమోపు నెత్తుకుంటే
కన్నులకు సీకటొచ్చి పాణమంత సోలబట్టే
ఇసిరిపడితే వరం మీద కాళ్ళు రెక్కలిరిగిపాయె
లేసేదెట్లరో కొడుక సేసేదెట్లరో బిడ్డ
ఎట్లా జెప్పుదో కొడుకా ఎప్పూడొస్తవో బిడ్డ
సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు

దూరాన ఉన్న నీవు దుమారంగ రాకు కొడుక
సావుకు దగ్గరైన సేతకాదు నాకు కొడుక
కాని రాజ్యమెల్లి పోతివి కండ్ల నిండా నీవే కొడుక
కడుపు నిండా సూసినంక కండ్లు మూసుకుంటా బిడ్డ
గంజి పోసి సాదుకున్న దగ్గరుండి కర్మ జెయ్యి
చేతులెత్తి మొక్కుతున్న సెలవు తీసుకుంటా బిడ్డ
ఆఖరి ఉత్తరమో కొడకా అందినక రా బిడ్డా
అవ్వానుంటనురో కొడుక ముట్టినంక రా బిడ్డ

Muddula Rajalo Koduka Lyrics In Telugu – Folk Song

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading