Menu Close

Movie Recommendations in Telugu – Lucy – “లూసీ” (2014) – మెదడు పనితనం 20% నుంచి 100% కి పెరిగితే..


Movie Recommendations in Telugu – Lucy – “లూసీ” (2014) – మెదడు పనితనం 20% నుంచి 100% కి పెరిగితే..

లూసీ (Lucy) ఒక సాధారణ స్త్రీ. ఆమె నేర ప్రవృత్తి ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ద్వార తెలియకుండ నిషేధిత వస్తువుల స్మగుల్ చేసే ముఠా చేతిలో పడి, సిపిహెచ్4 అను తీవ్ర ప్రభావశీలి పదార్ధాన్ని మరి కొందరితో కలిసి స్మగుల్ చేయడానికి ఎన్నుకొనబడుతుంది.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now
Movie Recommendations in Telugu - Lucy

వారు (కొరియన్ డ్రగ్ డీలర్స్) వ్యక్తుల శరీరం లోపల సర్జరీ చేసి సిపిహెచ్4 ను దాస్తారు. ఫ్లైట్ ముందు రోజు నిర్బంధంలో ఉంచినపుడు, లూసీ తనపై ఒక అత్యాచారాన్న్ని ప్రతిఘటించి, సిపిహెచ్4 ను దాచిన పొట్ట తీవ్రంగా తన్నబడి, ఆ సిపి4 పాకెట్ పొట్టలో పగిలి, ఆమె శరీరంలోకి ప్రవేశించి, మెదడు క్రమంగా 20% నుంచి 100% పని చేసే క్రమంలో మానవాతీత శక్తులామెకు అవగతమవుతాయి.

ఆ క్రమంలో ఆమె చేసే విన్యాసాలు, శక్తుల ప్రదర్శన ఉత్కంఠభరితంగా ఉన్నాయి. 20 ఏళ్ళు ఒక ప్రొఫెసర్ పరిశోధించి వ్రాసిన థియరీ ఆమె నిజం చేస్తుంటుంది. అతనిని కలిసి, 100% శక్తి ని చేరే సమయానికి, అపార జ్ఞానం పొంది, ఆ శక్తి ని మానవ శరీరం తట్టుకోలేదని చెప్పి, తనువు చాలిస్తూ, ఒక సూపర్ కంప్యూటర్ సృష్టించి, దానిలోకి knowledge transfer చేసి, సదరు computer access ను పెన్ డ్రైవ్ లో నిక్షిప్తం చేసి ప్రొఫెసర్ కి ఇస్తుంది.

ఈ చిత్రం లో ఆమె నటన చాలా వైవిధ్య భరితంగా ఉన్నది. సాధారణ స్త్రీగా ఉన్నపుడు తీవ్ర భయాందోళనల భావాలు, యోగిని గా మారినపుడు నిర్వికార స్థితి అనే పరస్పర విరుద్ధ భావాల ప్రకటన లూసీ (Scarlett Johannsen) అద్భుతంగా నటించారు.

చివరిలో ఆమె జీవితం, కాలం గురించి చెప్పిన మాటలు తీవ్ర ఆలోచన రేకెత్తించేవిలా, భారత ఆధ్యాత్మిక చింతనకు చాల దగ్గిరగా ఉన్నవి.

20% రాగానే, నెప్పి, బాధ, భావోద్వేగాలు ఆమెకు ఇక ఉండవు – వాటికి అతీతురాలు అవుతుంది – నిర్వికార తత్వం వలె.

ఒక సీన్ లో ఆమె కార్ చాలా వేగంగా నడుపుతున్నప్పుడు – ఆమె ముఖం ఎటువంటి ఆందోళన లేని నిర్మలత్వం చూడొచ్చు – ఒక యోగిని వలె. ఆమె పక్కన కూర్చున్న పోలీస్ ఆఫీసర్: ఎందుకంత వేగంగా నడుపుతారు అంటాడు. సమయం లేదు అంటుంది ఆమె. దానికి అతడు అసలు బతికంటూ ఉంటే కదా అంటే “we never really die” అంటుంది – “ఆత్మ నశించదు” అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు.

మీ ఫాన్ రెక్కలు చూడండి. కొంత వేగం పెరిగినాక అవి కనబడవు. అంటే అవి లేవా? తక్కువ వేగం తో ఉన్నపుడు కనబడినవి, వేగం పెరిగినాక ఎందుకు మాయం అవుతున్నాయి? మనమూ అంతే. కాలమే మన ఉనికి. కాలం లేకపోతే, ఏ పదార్ధం కాని, సృష్టి కాని లేవంటారు.

Amazon Prime ఈ సినిమా ని చూడవచ్చు లేదా, తెలుగులో చూడాలి అనుకుంటే జీ 5 స్ట్రీమ్ అవుతుంది.

Time is the only unit of measure, and our existence. Without time, we don’t exist.

SUBSCRIBE FOR MORE

Share with your friends & family
Posted in Movie Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading