ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Mounamgane Edagamani Lyrics in Telugu – మౌనంగానే ఎదగమనీ లిరిక్స్
మౌనంగానే ఎదగమనీ… మొక్క నీకు చెబుతుంది…
ఎదిగిన కొద్ది ఒదగమనీ… అర్ధమందులో ఉంది…
మౌనంగానే ఎదగమనీ… మొక్క నీకు చెబుతుంది…
ఎదిగిన కొద్ది ఒదగమనీ… అర్ధమందులో ఉంది…
అపజయాలు కలిగిన చోటే… గెలుపు పిలుపు వినిపిస్తుంది…
ఆకులన్ని రాలిన చోటే… కొత్త చిగురు కనిపిస్తుంది…
మౌనంగానే ఎదగమనీ… మొక్క నీకు చెబుతుంది…
ఎదిగిన కొద్ది ఒదగమనీ… అర్ధమందులో ఉంది…
అపజయాలు కలిగిన చోటే… గెలుపు పిలుపు వినిపిస్తుంది…
ఆకులన్ని రాలిన చోటే… కొత్త చిగురు కనిపిస్తుంది…
దూరమెంతొ ఉందనీ… దిగులుపడకు నేస్తమా…
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా…
భారమెంతో ఉందనీ… బాధపడకు నేస్తమా…
బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా…
సాగరమధనం మొదలవగానే… విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే… అమృతమిచ్చిందీ…
అవరోధాల దీవుల్లో… ఆనంద నిధి ఉన్నదీ…
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ…
తెలుసుకుంటె సత్యమిది… తలుచుకుంటె సాధ్యమిది..
మౌనంగానే ఎదగమనీ… మొక్క నీకు చెబుతుంది…
ఎదిగిన కొద్ది ఒదగమనీ… అర్ధమందులో ఉంది…
చెమట నీరు చిందగా… నుదుటి రాత మార్చుకో…
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో…
పిడికిలే బిగించగా… చేతిగీత మార్చుకో…
మారిపోని కధలే లేవని గమనించుకో…
తోచినట్టుగా అందరి రాతను… బ్రహ్మే రాస్తాడూ…
నచ్చినట్టుగా నీ తలరాతని… నువ్వే రాయాలీ…
అంతులేని చరితలకీ… ఆది నువ్వు కావాలి…
మౌనంగానే ఎదగమనీ… మొక్క నీకు చెబుతుంది…
ఎదిగిన కొద్ది ఒదగమనీ… అర్ధమందులో ఉంది…
అపజయాలు కలిగిన చోటే… గెలుపు పిలుపు వినిపిస్తుంది…
ఆకులన్ని రాలిన చోటే… కొత్త చిగురు కనిపిస్తుంది.. ..
Mounamgane Edagamani Lyrics in Telugu – మౌనంగానే ఎదగమనీ లిరిక్స్