ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Motivational Telugu Stories
తరగతిలో ఉన్న 50 మంది పిల్లలందరికీ ఒక్కొక్క బెలూన్ ఇచ్చి,
వాటిలో గాలి ఊది, స్కెచ్ పెన్ తో వాటిమీద వాళ్ళ పేర్లు రాసుకోమంది టీచర్.
ఆ బెలూన్లన్నింటినీ ఒక గదిలో వేయించి, బెలూన్లన్నింటినీ బాగా కలిపేసింది.
ఆ పిల్లలకు 5 నిముషాల టైం ఇచ్చి, ఎవరి బెలూన్ వాళ్ళను తెచ్చుకోమని చెప్పింది.
పిల్లలందరూ గదిలోకి పోయి వెతికితే ఎవ్వరూ తమ బెలూన్లు గుర్తు పట్టలేకపోయారు.
5 నిమిషాల తర్వాత టీచర్ పిల్లలను
‘ఏ బెలూనైనా తీసుకుని అది ఎవరిదో వాళ్ళకు ఇచ్చేయమ’ని చెప్పింది’
రెండు నిముషాల్లో ఎవరి బెలూన్ వాళ్ళ చేతికి వచ్చింది.
అప్పుడు టీచర్ చెప్పింది
“బెలూన్లు ఆనందం వంటివి.
తన ఆనందం మాత్రమే చూసుకుంటే
ఎవ్వరికీ ఆనందం దొరకదు.
పక్కవాడి ఆనందం గురించి కూడా ఆలోచిస్తే,
ప్రతి ఒక్కరికీ ఆనందం సులభంగా దొరుకుతుంది.”
సేకరణ – V V S Prasad