అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Most Important and Helpful Yoga Poses in Telugu 16
ట్రీ పోజ్(వ్రిక్షాసన – Vrikshasana): బ్రెయిన్ హెల్త్ కు యోగ

ట్రీ ఫోజ్ యోగ ఇది బ్రెయిన్ కు చాలా ప్రయోజనం.నిటారుగా నిల్చువాలి. పై స్లైడ్ లో చూపిన విధంగా నిల్చొని రెండు చేతులను పైకి లేపాలి. ఈ పొజిషన్ లోని యోగాసనం బ్రెయిన్ కు చాలా సహాయపడుతుంది.
పీకాక్ ఫోజ్ (మయూరాసన – Mayurasana): డయాబెటిక్ వారికి యోగ

డయాబెటిక్ తో బాధపడే వారికి ఈ స్లైడ్ లో చూపించిన యోగాసనం చాలా ఉపయోగకరం. ఈ ఆసనం వల్ల శరీరంలోని అవయవాలన్నీ చురుకుగా పనిచేసి, రక్తప్రసరణ అందించి రక్తప్రసరణను క్రమబద్దం చేస్తుందని అనేక మంది నిపుణులు నిర్ధారించారు.
ముద్రాసన – Mudrasana: వ్యాధినిరోధకతను పెంచే యోగాసన:

ఇది ‘ముద్రాసన’ ఈ ఆసనంను మనం రోజులో ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఈ యోగా భంగిమన వ్యాధినిరోధకను పంెచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఆందోళను నివారించడంలో సహాయపడుతుంది.
మంచి ఆరోగ్యానికి సూర్య నమస్కారం:

సూర్య నమస్కారం ఉదయం నిటారుగా పడే సూర్యని యొక్క కిరణాల్లో నిలబడి సూర్యునికి నమస్కరిస్తూ చేసే భంగిమ. ఈ భంగిమలో మన శరీరంలో అన్ని అవయవాలు కదిలికలు కలిగి ఉంటుంది. సూర్య నమస్కారంలో 12 డిఫరెంట్ భంగిమలు కలిగి ఉంటాయి. వీటిలో చాలావరకూ ముందుకు మరియు వెనుకకు చేసే భంగిమలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
వజ్రాసన – Vajrasana:

ఫోటోలో చూపిన విధంగా మొదట కాళ్ళు చాచి కూర్చోవాలి. వీపు నిటారుగా ఉండాలి. కుడికాలుని మోకాలు వద్ద వుంచి పాదాన్ని కుడి పిరుదు క్రిందికు చేర్చాలి. అలాగే ఎడమ కాలుని మడిచి పాదాన్ని ఎడమ పిరుదు క్రిందకు చేర్చాలి. రెండు చేతులతో కాళ్ళ ముడుకులు పట్టుకుని నడుము వంగకుండా నిటారుగా ఉండాలి. కళ్ళు పూర్తిగా మూసుకుని ఊపిరి పీల్చుకుంటూ శ్వాసను సాద్యమైనంత వరకూ బంధించి నిధానంగా వదలాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తొడలు, కాలి పిక్కల కండరాలు ధృడంగా తయారవుతాయి.
పవన ముక్తాసనం – Pawanmuktasana:

ముందుగా వెల్లకిలా పడుకొని గాలి లోపలికి పీల్చాలి. రెండు కాళ్ళను ఎత్తి మోకాలి వద్ద మడవాలి. తర్వాత 0 రెండు చేతులతో మోకాళ్ళను పొత్తి కడుపు మీదకు తేవాలి. ఊపిరి బిగపట్టి, తలను ఎత్తి, ముక్కుతో మోకాళ్ళను తాకాలి. తర్వాత శ్వాస విడుస్తూ తిరిగి కాళ్ళను చాపుతూ మామూలు స్థితికి రావాలి. ఈ ఆసనం వల్ల పొట్టలోని గ్యాస్ తీసివేస్తుంది. ఉదర కండరాల పని తీరు మెరుగుపరుస్తుంది. ఛాతీ భాగం, భుజాలు, చేతుల నొప్పులు పోగొడుతుంది. కడుపు భాగంలో పేరుకునే కొవ్వు పరిమాణం తగ్గుతుంది. పోస్ట్ మెనోపాజ్ లోని మహిళలకు ఇది చాలా ఉపయోగం. కడుపు భాగంలోనే కాక, తొడలు, మోకాళ్ళ కండరాలు బలోపేతం చేస్తుంది.
బాలాసన – Balasana:

పిల్లల భంగిమ అని సముచితంగా పిలవబడే ఈ ఆసనం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది నడుము, తొడలు, చీలమండలం లను కొద్దిగా సాగదీసి, మెదడును శాంతపరచి, ఒత్తిడిని, అలసటను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఈ బాల భంగిమ బాధను నివారించి, నరాల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.
నటరాజ ఆసనం – Natarajasana:

ఈ ఆసనం స్థితి శివుని నాట్య భంగిమను పోలి ఉంటుంది. కాబట్టి దీనికి నటరాజాసనం అని పేరు. నిటారుగా సమస్థితిలో నిలబడిన తర్వాత ఎడమకాలిని(ఫొటోలో ఉన్నట్లు) మోకాలి వద్ద వెనక్కు వంచాలి. ఆ కాలి మడమను ఎడమచేత్తో పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు కాలు, చేయి పరస్పరం వ్యతిరేక దిశలో లాగుతున్నట్లు ఉండాలి. ఇప్పుడు దేహాన్ని ముందుకు వంచి కుడి చేతిని ముందుకు చాపాలి. ఈ స్థితిలో దేహం ఒక కాలి మీద ఉంటుంది, దృష్టి నేరుగా ఉండాలి. ఉచ్వాసనిశ్వాసలు సాధారణంగా ఉండాలి. ఇప్పుడు ఎడమ పాదాన్ని తల మీదకు తెచ్చే ప్రయత్నం చేయాలి (తీసుకు రాగలిగినంత వరకే చేయాలి. బలవంతంగా ప్రయత్నించరాదు). ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండాలి. యథాస్థితికి వచ్చేటప్పుడు ఎడమకాలిని, కుడిచేతిని నిదానంగా కిందకు దించి సమస్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇదే క్రమాన్ని కుడికాలితో కూడా చేయాలి. ఇలా మూడు నుంచి ఐదు సార్లు చేయాలి. నటరాజ ఆసనం వేయడం ద్వారా ఏకాగ్రత పెరగడంతోపాటు వెన్నెముక శక్తిమంతం అవుతుంది. శరీరంలోని కండరాలు ఉత్తేజితమవుతాయి. ఆర్థరైటిస్, కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. భుజం, తుంటి, మోకాళ్లు, చీలమండ ఉత్తేజితమవుతాయి. సంభోగశక్తి మెరుగవుతుంది. స్థిర సంకల్ప శక్తి, కంటి చూపు మెరుగవుతాయి.
హలాసనం – Halasanam:

గాలి పీలుస్తూ కాళ్ళను పైకి ఎత్తాలి. అలాగే గాలి వదులుతూ కాళ్ళను తల మీదుగా వెనక్కి తీసుకువెళ్ళి కాలి వేళ్ళను నేలకు తాకించాలి. చేతులను వెనక్కి చాచి పాదాల దగ్గరికి తీసుకురావాలి . శ్వాసక్రియ మామూలుగా కొనసాగించాలి. గాలి లోపలికి పీలుస్తూ కాళ్ళను పైకి ఎత్తాలి. గాలిని వదులుతూ కాళ్ళను సాధారణ స్థితికి కిందికి దించాలి. ఇదే భంగిమను మరో రెండు మూడు సార్లు చేయాలి . ఈ ఆసనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది . వెన్నుకు వీపు కండరాలకు బలమిస్తుంది . అస్తమా , మలబద్ధకం, షుగర్ ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది .
మస్త్యాసనం – Matsyasana:

ఈ ఆసనంలో పద్మాసనంలో కాళ్ళు మెలిక వేసినట్టుగా వేసి వెనక్కి పడుకోవాలి. తర్వాత గాలి లోపలికి పీల్చి ఛాతీని పైకి లేపండి. మెడను వెనక్కి వంచాలి. శ్వాసక్రియ సాధారణ స్థాయిలోనే ఉండాలి. గాలిని వదులుతూ మోకాళ్ళ మీద బరువు పెడుతూ సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనం వల్ల శ్వాసక్రియను మెరుగుపడుతుంది. థైరాయిడ్, పారా థైరాయిడ్ గ్రంథుల సమస్యలను తగ్గిస్తుంది. వెన్ను సులభంగా కదిలేలా చేయగలదు.
బిటిలాసన – Bitilasana:

మోకాళ్లపై కూర్చుని ముందుకు వంగి చేతులు కిందికి పెట్టి ఈ ఆసనం చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ చురుగ్గా జరుగుతుంది, అంతేకాకుండా మెదడుకు కూడా హాయినిస్తుంది. ఆ ఆసనంలోనే కొన్ని మార్పులు చేస్తే బిటిలాసనం వస్తుంది. అదెలాగంటే.., నడుమును కిందకు వంచి.. తలను పైకి ఎత్తాలి. దీనివల్ల మెదడుకు వెళ్లే వెన్నెముక ఉత్తేజం అవుతుంది.
శిరసాసనం – Sirsasana:

మైగ్రెయిన్ తలనొప్పి: తరచుగా తలనొప్పి వచ్చే వారు జేబులో మాత్రలు పెట్టుకొని తిరిగే అవసరం లేకుండా చేస్తుంది యోగ. ఉద్రేకంతో వచ్చే తలనొప్పు లు, మైగ్రేన్ల బారి నుంచి కూడా బయటపడవ చ్చు. ఎందుకంటే ప్రాణాయామం, సిరసాసనం వంటి యోగాసనాలు మన మెదడుకు రక్తం, ప్రాణవాయువు సరిగా సరఫరా అయ్యేందుకు దోహదం చేసే తలనొప్పి ప్రారంభం కాకుండానే నివారిస్తుంది.
అర్ధకటి చక్రాసనం – Ardhakati Chakrasana:

కటి అంటే సంస్కృతంలో నడుము భాగం అని అర్థం . నడుము భాగం లోని కండరాలకు బలాన్నిచ్చే ఆసనం అన్నమాట . చక్రాకారంలో శరీరాన్ని వంచడం వల్ల దీన్ని చక్రాసనం అని కూడా అన్నారు. మొదటగా నిటారుగా నిలబడి చేతులు పిరుదుల ప్రక్కలకు ఆన్చాలి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ, కుడి చేతిని భుజం వరకు పైకి ఎత్తాలి. గాలిని వదిలి, అర చేతిని పైకెత్తి, గాలిని పీల్చుకుంటూ కుడి చేతిని తల వరకు తీసుకురావాలి. తిరిగి గాలిని వదులుతూ కుడి చేతి వంక చూస్తూ, నడుము భాగం వరకు ఆర్చ్ లాగ ప్రక్కకు వంచాలి . ఎడమ చేతితో మోకాలిని తాకడానికి ప్రయత్నించండి. మళ్ళీ నెమ్మదిగా గాలిని పీల్చుతూ నడుముని నిటారుగా ఉంచాలి. గాలిని వదులుతూ కుడిచేతిని భుజం వరకు తీసుకు రావాలి . గాలి పీల్చి, పైకి ఉంచిన అరచేతిని క్రిందికి వంచి , గాలి వదులుతూ చేతిని కిందికి దింపాలి. రెండు కాళ్ళు ఎడంగా ఉంచి రిలాక్సవ్వండి . మళ్ళీ ఎడమ చేతితో ఇదే విధంగా రిపీట్ చేయండి .ఈ ఆసనం చేయడం వల్ల ఊపిరితిత్తులకు, నడుం భాగంలోని కండరాలకు బలాన్నిస్తుంది . నడుం భాగంలోని కొవ్వుని కరిగించి సన్నబరుస్తుంది. శరీరాన్ని ప్రక్కకు వంచడం వలన వెన్నుపాముకు సాగే గుణాన్ని పెంచుతుంది .
వజ్రాసనం – Vajrasana:

మిగిలిన ఆసనాలకు భిన్నంగా ఈ వజ్రాసనాన్ని భోజనం చేసిన వెంటనే సైతం వేయవచ్చు. మూత్రాశయంలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తుంది. బరువు తగ్గటంలో సహాయపడంతోబాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరచి కడుపులో గ్యాస్ ను తగ్గిస్తుంది.
సర్వాంగాసనం – Sarvangasana:

థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా ఊపిరితిత్తులు, అన్నవాహిక, జననేంద్రియాలు, నాడీవ్యవస్థలు ఆరోగ్యంగా పనిచేసేందుకు దోహదపడుతుంది.
కపాలభాతి – Kapalabhati:

కపాలభాతి ప్రాణాయామం కపాలభాతి ద్వారా మెదడులోని కణాలకు మరింత ప్రాణవాయువు అందుతుంది. ఆ విధంగా ఇది నాడీవ్యవస్థకు చాలా మంచిది. శరీరంలోని విషపదార్థాలను నిర్మూలించి, స్థూలకాయం, మధుమేహాలను తగ్గించటంలో సహాయపడుతుంది.
Most Important and Helpful Yoga Poses in Telugu 16, Best Yoga Poses in Telugu, Yoga Poses for Good Health in Telugu