ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moral Stories in Telugu
ఒక అడవిలో నడిచిపోతున్న బాటసారి, మిట్టమధ్యాహ్నం కావడంతో బాగా అలిసిపోయి, ఓ చెట్టు నీడన కూర్చొని సేద తీరుతున్నాడు. దాహంతో నోరు పిడచ కట్టుకొని పోతుంటే తాగడానికి మంచినీళ్లు దొరికితే బాగుంటుందని అనుకున్నాడు. ఇలా అనుకున్నాడో లేదో, ఆశ్చర్యంగా ఒక మ్యాజిక్ జరిగినట్లు, ఒక చల్లని నీళ్ల కూజా అతని ముందు ప్రత్యక్షమైంది.
తృప్తిగా నీళ్లు తాగి నేల మీద వాలాడు. ఇంతలో కడుపులో ఎలుకలు పరుగెడుతున్నట్లు అనిపించి, ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అనుకున్నాడు. అంతే ఒక విస్తరిలో రుచికరమైన భోజనం అతని ముందు వాలింది. కడుపునిండా తిన్న తర్వాత భుక్తాయాసంతో, నేల మీద వాలాడు.
‘అబ్బా! ఈ మట్టి నేల మీద పడుకుంటే ఒళ్ళంతా ఒరుసుకుపోతోంది. ప్.. మంచి పరుపుంటే బాగుండు, అనుకున్నాడు. అంతే క్షణాల్లో హంసతూలికా తల్పం మీద పడుకొని ఉన్నాడు. బాటసారికి తెలీదు తను ‘కల్పవృక్షం’ నీడలో ఉన్నానని. మంచి నిద్రపోయి లేచి చూస్తే చీకటి పడింది.
తనొక్కడే అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అడవిలో ఉండే క్రూర మృగాలు గుర్తొచ్చాయి. సుఖాలన్నీ అనుభవించిన తర్వాత అతనికి నెగటివ్ ఆలోచనలు మొదలయ్యా యి. ‘ఏ పులో వచ్చి చంపేస్తే అనుకున్నాడు. చిటికలో పులి ప్రత్యక్షమై అతణ్ణి చంపేసింది.
పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉన్నంతకాలం మంచి ఫలితాలు వస్తాయి. దానిద్వారా ఆనందం, నచ్చిన కోరికలు సంప్రాప్తిస్తాయి. అందుకే నిరంతరం సకారాత్మకంగానే (పాజిటివ్) ఆలోచించాలి.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Moral Stories in Telugu