ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moral Stories in Telugu
సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ, కాఫీ తాగుతున్న ఒక ధనవంతుడు బాల్కనీ పిట్టగోడ మీద ఒక చీమ దాని కంటే ఎన్నోరెట్లు బరువైన ఒక ఆకును మోస్తూ ఒక వైపు నుండి మరొక వైపుకు, అడ్డంకులను అధిగమిస్తూ ప్రయాణం సాగించింది. ఆ పిట్టగోడ మీద ఒక పగులు దానికి పెద్ద అడ్డంకిగా మారింది.
కొద్ది సేపు అక్కడ ఆగి తన తెలివితేటలతో ఆకును పగులుకు అడ్డంగా వేసి, ఆకు మీదుగా నడిచి అటుపోయి మళ్ళీ ఆకును మోసుకు పోసాగింది. ఆకును అవతలి ఒడ్డుకు చేర్చడానికి దానికున్న మెదడు, అంచనా వేసే తత్వాన్ని, అడ్డంకిని అధిగమించే ప్రతిభకు ముగ్ధుడయ్యాడు.
అలా ప్రయాణిస్తూ అదొక చిన్న రంధ్రం, దాని గూడుకు చేరింది. ఆ పెద్ద ఆకును దాని గూటిలోకి ఎలా చేరుస్తుందా అని చూసాడు. చీమ అన్ని అడ్డంకులను, సమస్యలను ఎదుర్కొంది కానీ, ఇంటిలోకి తీసుకెళ్లలేక, ఒట్టి చేతులతో పోయింది.
ఆ పెద్దమనిషి ఆ గంట సమయంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. ఆ పాఠాలు మనకు కూడా వర్తిస్తాయి కదా! మనం మన కుటుంబం, ఉద్యోగం, సంపాదన గురించి ఆందోళన చెందుతుంటాం. ఎంత పెద్ద ఇల్లు, ఎంత గొప్ప కారు, సుఖాన్నిచ్చే ఏఏ వస్తువులు కావాలో ఆలోచిస్తుంటాం, చివరికి అన్నింటినీ ఒదిలేసి స్మశానానికి చేరుకుంటాం. మన జీవితంలో ఇవన్నీ అనవసరమైన భారం అనీ, వృధా అని అర్థం చేసుకోం. మన వస్తు సంపద పట్ల అత్యంత జాగరూకత వహిస్తాం. కానీ వాటిని మనతో తీసుకుపోలేం అని గ్రహించం.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Moral Stories in Telugu