ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moral Stories in Telugu
ఒక మ్యూజియం క్రింది అంతస్తులో పెద్ద పెద్ద పైంటింగుల మధ్య చాలా అందమైన గూడు కట్టుకుని ప్రశాంతంగా జీవిస్తుండేది ఒక సాలీడు. దాని గూడంటే పంచప్రాణాలు. అయితే ఒక ప్రదర్శన కోసం మ్యూజియం శుభ్రం చేయడం మొదలు పెట్టారు.
రాబోయే అపాయాన్ని కనిపెట్టి చాలా సాలీళ్ళు గూళ్ళు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. ఈ సాలీడు మాత్రం ‘తొందరేం లేదులే’ అని ఆగిపోయింది. సమయం గడుస్తున్న కొద్దీ పైంటింగులు తరలిపోతున్నాయి. అయినా సాలీడు అక్కడ నుంచి తన అందమైన గూడు వదిలి పెట్టి మొండిగా కదలలేదు.
ఒక రోజు దాని గూడు చుట్టూ ఉన్న పైంటింగులను కూడా తరలించడం మొదలు పెట్టారు. ఇంక అక్కడ ఉంటే ప్రాణాలకే ముప్పు అని తెలుసుకొని, బలాన్నంతా కూడగట్టుకుని, దాని అందమైన గూటిని ఒదిలి పోవడానికి నిశ్చయించుకొనింది.
చివరికి మంచి నిర్ణయం తీసుకొంది. మ్యూజియంలో పురుగుల మందులు కొట్టి కీటకాలను నిర్మూలించడం మొదలు పెట్టారు. చాలా కష్టపడి బయటికి పోయి, నిర్మానుష్యంగా ఉన్న ఒక తోటలో అంత కన్నా మంచి గూడు కట్టుకుని సుఖంగా జీవించసాగింది.
జీవితంలో కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొనే సమయం వస్తుంది. మన జీవితాన్ని ధారపోసి ఆనందహర్మ్యాన్ని కట్టుకున్నా ఒదిలి పెట్టక తప్పదు. ఆ అందమైన భవంతిని ఒదిలేసామంటే అది ఓటమి కాదు. మన శక్తిసామర్ధ్యాలను వినియోగించి కృషి చేస్తే అంతకన్నా గొప్ప స్థాయికి చేరుకుంటాం. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Moral Stories in Telugu