ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moral Stories in Telugu
ఒక రాజుగారు తన స్నేహితులకు ఘనమైన విందు భోజనం ఏర్పాటు చేయాలనుకున్నాడు. అన్ని రకాల ఆహార పదార్థాలు దొరికాయి, కానీ ఒక రకం ప్రత్యేకమైన చేపలు దొరక లేదు. రాజు గారు ఆ చేపలు తెచ్చిన వాళ్ళకు మంచి బహుమతి ఇస్తానని దండోరా వేయించాడు.
రేపు విందు అనగా ఒక జాలరి ఒక పెద్ద చేపను పట్టుకొచ్చి, రాజభవనం ముందు ప్రత్యక్షమయ్యాడు. ద్వారపాలకుడు జాలరిని రాజుగారిచ్చే బహుమతిలో సగం ఇస్తే లోపలికి పోనిస్తానని షరతు పెట్టాడు. విధిలేక జాలరి ఒప్పుకున్నాడు.
ఆ చేపను చూసి రాజు గారు ఉబ్బి తబ్బిబ్బై చాలా ధనాన్ని బహుమతిగా ఇవ్వబోతే, జాలరి తిరస్కరించి తనకు వంద కొరడా దెబ్బలు ఇమ్మని కోరుకున్నాడు. ఆశ్చర్యంలో మునిగిన రాజు, జాలరి కోరుకున్నట్లు, సేవకుడితో వంద కొరడా దెబ్బలు ఇమ్మన్నాడు.
జాలరి 50 కొరడా దెబ్బలు తిని ఆపమన్నాడు. “మీ ద్వారపాలకుడు నన్ను లోపలికి పంపడానికి సగం బహుమతి ఇమ్మని అడిగాడు, మిగిలిన
దెబ్బలు మీ ద్వారపాలకుడికి ఇవ్వండి మహారాజా!” రాజుకు అంతా అర్థమైంది.
ద్వారపాలకుడిని పిలిపించి, 50 కొరడా దెబ్బలు ఇచ్చి ఉద్యోగం నుండి తొలగించాడు. జాలరి పనితనానికి, తెలివితేటలకూ మెచ్చి మంచి బహుమతి ఇచ్చి
పంపాడు.
తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు సమస్యల్లోకి నెట్టేస్తాయి. వివేకవంతంగా ఆలోచిస్తే సమస్యలను ఎదుర్కోవచ్చు. అందుకే వివేకవంతులుగా ఉండండి, మంచే చెయ్యండి.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Moral Stories in Telugu