ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moral Stories in Telugu
టీచర్ విజిల్ వేయగానే 50 మంది పిల్లలు పరుగు పందెంలో పాల్గొన్నారు. దూరంగా ఉన్న చెట్టు చుట్టూ తిరిగి రావాలి. ప్రతి క్రీడాకారుడి లక్ష్యం ఫస్ట్ రావాలి.
పిల్లల తల్లిదండ్రులు కూడా పందాన్ని చూడడానికి వచ్చారు. పిల్లలను స్పీడుగా పరిగెత్తమని ఉత్సాహ పరుస్తున్నారు. పందెం పూర్తి అయింది.
మొదటి ముగ్గురికీ ప్రైజులు వచ్చాయి. గెలిచినవాళ్ళు గర్వంగా చేతులూపుతుంటే, ఓడిన వాళ్ళు నిరాశగా ఉన్నారు. పోటీలో 5వ స్థానంలో వచ్చిన అమ్మాయి నిరాశగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. తండ్రి ఆ అమ్మాయిని హత్తుకుని, “శభాష్!! బాగా పరిగెత్తావ్! ఐస్ క్రీం ఇష్టం కదా! ఏ ఐస్ క్రీం తింటావ్?” “కానీ, నాన్నా, నేను మొదటి ముగ్గురిలో లేనుకదా!” “కాదు కాదు, నువ్వు ఫస్ట్ వచ్చావ్! నీకు తెలీదు.”
“లేదు నాన్నా! నేను 5th వచ్చా ను.” “నీ వెనక ఎంత మంది ఉన్నారు? “45 మంది”చెప్పింది పాప. ” అంటే 45 మంది కంటే బాగా పరిగెత్తావు. అందుకే ఐస్ క్రీం.” ” నలుగురు నాకంటే బాగా పరిగెత్తారు కదా!” ” అవును! ఆ నలుగురు బాగా ప్రాక్టీస్ చేసారు. నువ్వు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేసారి ఫస్ట్ వస్తావ్!!” ” అయితే నేను ఇంకా ప్రాక్టీస్ చేసి ఈ సారి ఫస్ట్ వస్తాను.”
“ఎందుకంత తొందర ! ముందు నీ కాళ్ళు బలంగా మారాలి. మిగిలిన వాళ్ళకంటే ముందుండడం కాదు. మనకు మనమే ముందుండాలి.” పాప ఉత్సాహంగా ఐస్ క్రీం తినింది.
మనల్ని ఇతరులతో పోల్చుకోవడం పోటీ కాదు, మన గురించి మనం అర్థం చేసుకోవడం, మన బలం తెలుసుకోవడం
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Moral Stories in Telugu