Moral Stories in Telugu
యుద్ధభూమిలో గాయపడి, పడి ఉన్న స్నేహితుడిని తీసుకురావడానికి ఒక సైనికుడు ప్రయత్నిస్తున్నాడు. దాన్ని చూసి పై అధికారి, “ఉపయోగం లేదు, నీవు పోయే లోపల చనిపోయి ఉంటాడు. అనవసరమైన రిస్క్”. సైనికుడు అధికారి మాట వినకుండా యుద్ధభూమిలో పడి ఉన్న స్నేహితుడి పార్థివ దేహాన్ని తీసుకొచ్చాడు”.
నేను అప్పుడే చెప్పాను కదా, నీ స్నేహితుడు చనిపోయి ఉంటాడని, తేవడం వృధా ప్రయాస అనీ!!” సైనికుడు నీళ్లు నిండిన కళ్ళతో, “కానీ అతనిని తీసుకురావడానికి పోవడం నిజంగా నా అదృష్టం.. నా స్నేహితుడి దగ్గరకు వెళ్లగానే, నా కళ్ళలోకి నా స్నేహితుడు చూసి, చిరునవ్వు నవ్వి, ‘నువ్వు వస్తావని నాకు తెలుసు’ అన్న చివరి మాటలు వినగలిగాను.”
తమ స్నేహితుల కోసం, తమ వాళ్ళ కోసం కొందరు ఎంతటి సాహసం అయినా చేయడానికి వెనకాడరు. ఒక చిన్న సహాయం అయినా ఆనందాన్ని ఇస్తుంది.
సేకరణ – V V S Prasad