భార్య: మన పొరిగింట్లో కొత్తగా దిగిన ఆయన ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లే సమయంలో
తన భార్యకు ముద్దు ఇచ్చి వెళ్తాడు,
అలా నువ్వెందుకు ముద్దు ఇవ్వవు..?
భర్త: నేనెలా ఆమెకు ముద్దు ఇవ్వగలను, ఆమె ఎవరో కూడా తెలియదే..!
భర్త: నాకు విడాకులు కావాలి. గత ఆరునెలలుగా నా భార్య నాతో మాట్లాడటం లేదు
లాయర్: ఒక్కసారి ఆలోచించు.. అలాంటి భార్యలు చాలా అరుదుగా దొరుకుతారు
భార్య: డాక్టర్ నా భర్త ఆస్ప్రిన్ మెడిసిన్ పొరపాటున మింగేశాడు.. ఇప్పుడేం చేయాలి..?
డాక్టర్ : అతనికి తలనొప్పి కలిగించే పని ఏదైనా చేయి.. అనవసరంగా టాబ్లెట్‌ను వేస్ట్ చేయడమెందుకు
భార్య: నేను నీతో మాట్లాడదలుచుకోలేదు
భర్త: ఓకే
భార్య : కారణం ఏమిటో అడగవా..?
భర్త: అవసరం లేదు..నేను నీ మాటను గౌరవిస్తాను.
భార్యా భర్తలు ఇద్దరూ ఓ రెస్టారెంటులో కలిసి భోజనం చేసేందుకు వెళ్లారు.
ఇద్దరూ కూర్చొని ఉండగా సర్వర్ వచ్చి ఆర్డర్ తీసుకుని భోజనం టేబుల్‌పై ఉంచాడు.
భర్త: భోజనం చాలా బాగుంది. తినడం ప్రారంభిద్దాం
భార్య: ఏమండి తినే ముందు ప్రార్థన చేసే అలవాటు ఉంది కదా… ప్రార్థన చేయండి
భర్త: అది ఇంటి భోజనంకే డియర్ ,
ఇక్కడ వంటవాడికి ఎలా రుచికరంగా వండాలో బాగా తెలుసు.
భార్య భర్తతో : భోజనం చేశావా..?
భర్త భార్యతో: భోజనం చేశావా..?
భార్య భర్తతో : ముందు నేనడిగాను కదా..?
భర్త భార్యతో : నేను కూడా అడుగుతున్నాను కదా..?
భార్య : ఏంటి ఏది మాట్లాడితే అది తిరిగి చెబుతున్నావ్..?
భర్త: ఏంటి ఏది మాట్లాడితే అది మాట్లాడుతున్నావ్..?
భార్య : సరే షాపింగ్‌కు వెళ్దాం పదండి
భర్త: నేను భోజనం చేసేశాను.
కోర్టులో విడాకులు పొందేందుకు భార్యా భర్తలు తమ ముగ్గురు పిల్లలను తీసుకుని వెళ్లారు
జడ్జి: మీకు ముగ్గురు పిల్లలున్నారు కదా ఎలా వారిని పంచుకుంటారు..?
భార్యా భర్తలు చర్చించుకున్నాక: సరే సర్..
ఇంకొకరిని కని వచ్చే ఏడాది విడాకుల కోసం వస్తాం
9 నెలల తర్వాత కవలలు పుట్టడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది.
భార్య : దొంగ ఇంట్లోకి చొరబడి నేను చేసిన కేకును తింటున్నాడు చూడండి
భర్త: ఇప్పుడు నేనేం చేయాలి..?
పోలీసులకు ఫోన్ చేయాలా.. ?
లేక అంబులెన్స్‌కు ఫోన్ చేయాలా..?
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.