Menu Close

Meesamunna Nesthama Song Lyrics In Telugu – Sneham Kosam

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Meesamunna Nesthama Song Lyrics In Telugu – Sneham Kosam

మీసమున్న నేస్తమా… నీకు రోషమెక్కువ
మీసమున్న నేస్తమా… నీకు రోషమెక్కువ
రోషమున్న నేస్తమా… నీకు కోపమెక్కువ
కోపమెక్కువ కానీ… మనసు మక్కువ
స్నేహానికి చెలికాడా… దోస్తీకి సరిజోడా
ఏళ్ళెదిగిన పసివాడా… ఎన్నటికీ నిను వీడ
మీసమున్న నేస్తమా… హోయ్

ఏటిగట్టు చెబుతుంది అడుగు… మన చేపవేట కధలు
మర్రిచెట్టు చెబుతుంది పంచుకొని… తిన్నసద్ది రుచులు
చెఱకు తోట చెబుతుంది అడుగు… ఆనాటి చిలిపి పనులు
టెంటు హాలు చెబుతుంది… ఎన్.టి.ఆర్. స్టంటు బొమ్మ కధలు

పరుగెడుతూ పడిపోతూ… ఆ నూతుల్లో ఈత కొడుతూ
ఎన్నేళ్ళో గడిచాయి… ఆ గురుతులనే విడిచాయి
వయసంత మరచి… కేరింతలాడె ఆ తీపి జ్ణాపకాలు
కలకాలం మనతోటే… వెన్నంటే ఉంటాయి
మనలాగే అవికూడా… విడిపోలేనంటాయి

మీసమున్న నేస్తమా… నీకు రోషమెక్కువ
రోషమున్న నేస్తమా… నీకు కోపమెక్కువ

ఒక్క తల్లి సంతానమైన… మనలాగ ఉండగలరా
ఒకరు కాదు మనమిద్దరంటే… ఎవరైన నమ్మగలరా… ఆ ఆఆ
నువ్వు పెంచిన పిల్ల పాపలకు… కన్నతండ్రినైనా
ప్రేమ పంచిన తీరులోన… నే నిన్ను మించగలనా

ఏ పుణ్యం చేసానో… నే నీ స్నేహం పొందాను
నా ప్రాణం నీదైనా… నీ చెలిమి ఋణం తీరేనా… ఆ ఆఆ
నీకు సేవ చేసేందుకైనా… మరుజన్మ కోరుకోనా
స్నేహానికి చెలికాడా… దోస్తీకి సరిజోడా
ఏళ్ళెదిగిన పసివాడా… ఎన్నటికీ నిను వీడ

మీసమున్న నేస్తమా… నీకు రోషమెక్కువ
రోషమున్న నేస్తమా… నీకు కోపమెక్కువ
కోపమెక్కువ కానీ… మనసు మక్కువ
స్నేహానికి చెలికాడా… దోస్తీకి సరిజోడా
ఏళ్ళెదిగిన పసివాడా… ఎన్నటికీ నిను వీడ

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading