Menu Close

Andala Rakshasive Song Lyrics In Telugu – Oke Okkadu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Andala Rakshasive Song Lyrics In Telugu – Oke Okkadu

అందాల రాక్షసివే… గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో… తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా… మనసే కోశావే
అందాల రాక్షసివే… గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా… మనసే కోశావే

గడ్డి మొక్కకు కోత తెలియునా… బాలకుమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా…
బైట పూసినా లోన కాసెడి… శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ… కాయలొలిచెడి తుంటరి సుమా
చిలకా… రామ చిలకా
మొలకా… ప్రేమ మొలకా
అందాల రాక్షసివే… గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా… మనసే కోశావే

సూర్యున్ని రెండు చేసి… కళ్ళలోన దాచుకుందో… అహ…ఓ
చందురున్ని కంటిపాపలోన… తాను ఉంచుకుందో ఓ..
రాతిరిని పట్టుకొచ్చి… కాటుకల్లె పెట్టెదనా అహ.. ఓ
మిణుగురులు అంటించి… బుగ్గలకు నిగ్గు తేనా ఓ..
పొగిడి నను రెచ్చగొట్టి… నిద్ర చెడగొట్టకయ్యా
తలగడగా నాకొక్క… పంచె నువ్వీయవయా
కనులా కునుకే కలయా…
చిలకా… రామ చిలకా…
మొలకా… ప్రేమ మొలకా

అందాల రాక్షసివే… గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో… తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా… మనసే కోశావే

కొండపల్లి బొమ్మతోటి… జంటచేరి ఆడుకుండ
కొండపల్లి బొమ్మతోటి… జంటచేరి ఆడుకుండ

తేనెపట్టు పట్టుపట్టి… పాడు చేయ శపథమా అహ… ఓ
ప్రేమంటే పార్టీ విడిచీ… పార్టీ మార్చు విషయమా ఓ…
కన్నెపిల్ల సైగ చేస్తే… తలక్రిందులౌదువా అహ… ఓ
నే నడుచు నీడలోన… నీవుండ సమ్మతమా
నేగనక నీరైతే… నీ నుదుటపై నే జారి
అందాల నీ ఎదపై… హుందాగ కొలువుంటా
కానీ అన్నీ కలలే…
చిలకా… రామ చిలకా
మొలకా… ప్రేమ మొలకా

అందాల రాక్షసివే… గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా… మనసే కోశావే

గడ్డి మొక్కకు కోత తెలియునా… బాలకుమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా…
బైట పూసినా లోన కాసెడి… శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ… కాయలొలిచెడి తుంటరి సుమా

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading