Menu Close

Matti Lyrics in Telugu and English – Kranti – 2022

Matti Lyrics in Telugu and English – Kranti – 2022

నువ్వే నడిచిన మట్టి ఇది
నిన్నే మోసిన గర్భ గుడి
ఇపుడే ఇపుడే రమ్మంటు
నిన్ను పిలిచే

నువ్వే ఎదిగిన నేల ఇది
అచ్చం ఇంకొక తల్లి ఒడి
కనుకే కనుకే పొలమారి
నిన్ను తలిచే

ఊపిరి పోసిన గాలి ఇదేలే
తీయని గురుతుల తోవ ఇదేలే
ఊయల కట్టిన ఊరు
ఈతలు కొట్టిన ఏరు
ప్రేమగ నువ్వొకమారు గుర్తుచేసుకో

వెతికితే ఇక్కడే దొరకదా బాల్యమే

నువ్వే నడిచిన మట్టి ఇది
నిన్నే మోసిన గర్భ గుడి
ఇపుడే ఇపుడే రమ్మంటు
నిన్ను పిలిచే

నువ్వే ఎదిగిన నేల ఇది
అచ్చం ఇంకొక తల్లి ఒడి
కనుకే కనుకే పొలమారి
నిన్ను తలిచె

విత్తనమై నువ్వొస్తే
నిన్నొక చెట్టుని చేసిందే
భారమని అనకుండా
నెత్తిన పెట్టుకు చూసిందే

స్వార్ధం అంటే ఏంటో
అర్ధం తెలియదులే
పంచే గుణమే తనది
తిరిగేం అడగదులే

శిఖరమై ఎదిగి వచ్చిన
నిన్ను తరుముతూ
తలని నిమురును కదరా

ఎంతటి గొప్పదీ పుడమి
పచ్చని తనమే పులిమి
మనతో చేసెను చెలిమి
కొలిచి మ్రొక్కుకో

చిటికెడూ మట్టినీ బొట్టులా పెట్టుకో

నువ్వే నడిచిన మట్టి ఇది
నిన్నే మోసిన గర్భ గుడి
ఇపుడే ఇపుడే రమ్మంటు
నిన్ను పిలిచే

నువ్వే ఎదిగిన నేల ఇది
అచ్చం ఇంకొక తల్లి ఒడి
కనుకే కనుకే పొలమారి
నిన్ను తలిచే

చూడంగానే నిన్ను వెలిగీపోయి కన్ను
పొంగీ పొంగీ పోయే మన్ను
రంగు వానవిల్లు రెల్లు పూలజల్లు
పంపించింది ఆ మిన్ను

నీకోసం ఇంటి తలుపు
నీకోసం వీధి మలుపు
కళ్ళల్లో వత్తులేసి చూసె
ఇష్టంగా ఇన్నినాళ్ళు
నీ క్షేమం కోరినోళ్ళు
గుమ్మంలో దిష్ఠి తీసే

మన్నుకీ మనిషికీ తెగదులే బంధమే.. ..

Matti Lyrics in Telugu and English – Kranti – 2022

Nuvve Nadichina Matti Idhi
Ninne Mosina Garbha Gudi
Ipude Ipude Rammantu
Ninnu Piliche

Nuvve Edhigina Nela Idhi
Achham Inkoka Thalli Odi
Kanuke Kanuke Polamaari
Ninnu Thaliche

Oopiri Posina Gaali Idhele
Theeyani Guruthula Thova Idhele
Ooyala Kattina Ooru
Eethalu Kottina Yeru
Premaga Nuvvokamaaru Gurthuchesuko

Vethikithe Ikkade
Dhorakadhaa Baalyame

Nuvve Nadichina Matti Idhi
Ninne Mosina Garbha Gudi
Ipude Ipude Rammantu
Ninnu Piliche

Nuvve Edhigina Nela Idhi
Achham Inkoka Thalli Odi
Kanuke Kanuke Polamaari
Ninnu Thaliche

Vitthanamai Nuvvosthe
Ninnoka Chettuni Chesindhe
Bhaaramani Anakunda
Netthina Pettuku Choosindhe

Swaardham Ante Ento
Ardham Theliyadhule
Panche Guname Thanadhi
Thirigem Adagadhule

Shikharamai Edhigi Vachhina
Ninnu Tharumuthu
Thalani Nimurunu Kadaraa

Enthati Goppadhee Pudami
Pachhani Thaname Pulimi
Manatho Chesenu Chelimi
Kolichi Mrokkuko

Chitekedoo Mattinee
Bottulaa Pettuko

Nuvve Nadichina Matti Idhi
Ninne Mosina Garbha Gudi
Ipude Ipude Rammantu
Ninnu Piliche

Nuvve Edhigina Nela Idhi
Achham Inkoka Thalli Odi
Kanuke Kanuke Polamaari
Ninnu Thaliche

Choodangaane Ninnu Veligeepoyi Kannu
Pongee Pongee Poye Mannu
Rangu Vaanavillu Rellu Poolajallu
Pampinchindhi Aa Minnu

Neekosam Inti Thalupu
Neekosam Veedhi Malupu
Kallallo Vatthulesi Choose
Ishtamgaa Inninaallu
Nee Kshemam Korinollu
Gummamlo Dishti Teese

Mannukee Manishikee
Thegadhule Bandhame.. ..

Matti Lyrics in Telugu and English – Kranti – 2022

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading