ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
హరహర మహాదేవ శంకరా… హరహర మహాదేవ శంకరా
ఓ ఓ..! సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా
అండము నీవే పిండము నీవే
ఓ ఓ..! ఆత్మవు నీవే పరమాత్మవు నీవే
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో..! పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే
సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
ఓ ఓఓ..! గిరీ సుర సుతా గౌరీ సఖీయై నీ తోడుండా
శంఖ జోలె శంఖు పుర్రె నీకు పూదండ
రంగు లేని నాగమణి మెడలోన వెలుగుచుండ
ఏమీ లేని భైరాగోలే యాచించుచుండ
వెన్నెలనే తలపై కొలువై చిందులాడ
ఎందుకురా బూడిద నీ నొసట
గిరిజనమే నీకు బంధువులైరిరా
సిరులున్నా మురువవు సిత్రమురా
కలిమి లేమి కష్టము సుఖము
ఓ ఓఓ… నీ తూకములో అంతా ఒకటే
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళపు సంద్రము నీవే
ఒహో..! ఉండీ లేనట్టుండే ఉనికివి నీవే
ప్రళయ విలయ తాళాలకు కర్తవు నీవే
సాధు జంగమా ఆది దేవుడా
హరహర మహాదేవ శంకరా
ఓ ఓఓ..! బిలువ మాల సుగంధాల పూసిన పూల పల్లకి నేల
తలపించేను కమనీయంగా శివుడా నీ లీల
సద్గురు వేదం శంభుని నాదం… అందాల ఈ సుందర ధామం
నింగీ నేలకు నిచ్చెనలు వేసే పావన పీఠము
ఈ దినమే గానం ప్రణవ నాదముగా
ఢమరుకమే ధిమిధిమి మోగెనురా
భువి నుంచి గంగ దివికే పొంగెనురా
నటరాజై శివుడే ఆడెనురా
నమఃశివాయ సిద్దనమాయ
ఓ ఓ..! సిద్దనమాయ అభిశుద్ధ నమాయ
పంచాక్షరీ జపమంత్రమే పరమశివాయ
కైవల్యం కైలాసం నమఃశివాయ
ఒహో..! అద్వైతం శివతత్వం సదాశివాయ
పూర్ణం పరిపూర్ణం గురుపూర్ణనమాయ
సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా
అండము నీవే పిండము నీవే
ఓ ఓ..! ఆత్మవు నీవే పరమాత్మవు నీవే
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో..! పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే
సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
హరహర మహాదేవ శంకరా