ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
సేను సెలక మురిసేటి వేళ
రామ చిలుక పలికేటి వేళ… ఊరే తెల్లారే… ఏ ఏ
వాడంత రంగు రంగుల సింగిడాయే
పళ్ళెంత పండుగొస్తే సందడాయే…
కొమ్మల్లో పూల గుత్తులు ఊయలూగే
గాలుల్లో అగరబత్తుల… పోగలె సాగే
సేను సెలక మురిసేటి వేళ… రామ చిలుక పలికేటి వేళ
చెరువులో తేలే తామరలోలే… చెల్లెలు చేరేనే… ఓ ఓ ఓఒ
అక్కలు బావలు అన్నలు తమ్ములు… అమ్మలూ మురిసేలే
తళతళలాడే తంగెడులూ… మరదలు వదినెల అల్లరులు
గులుగు మోదుగు గుమ్మడులు… అవ్వల నవ్వులురా ఓ ఓఓ
చిన్నారి చిట్టి బొడ్డెమ్మల్ని పెట్టు… జాబిల్లి సుట్టు సుక్కలు చేరినట్టు
సందేళ తుల్లుతుంది వానగట్టు… నీలాలా నింగి నేలకొచ్చినట్టు
ఏలో ఏలెలో ఏలో ఏలెలో… ఏలో ఏలెలో ఏలో
ఏలో ఏలెలో ఏలో ఏలెలో… ఏలో ఏలెలో ఏలో
పూసల పేరు అల్లిన తీరు… పువ్వులు పెర్సెనే… ఏ ఏ ఓ ఓ
మనసున కోరే ఆశలు తీరే… పూజలు చేసేను
సీతజడల సంబరము… కళకళల కనకాంబరము
సీరెలు సారేలు వాయినం… ఎనకటి వంతనరా… ఓఓ ఓ ఓ
తేనెల్ల వాగులన్నీ పారినట్టు… కోయిల్ల గుంపుకట్టి పాడినట్టు
సేతుల్ల డోలుభాజ మోగినట్టు… గుండ్రంగా ఆడుతారు కట్టినట్టు
జగములో ఏ చోటున… లేదే ఈ ముచ్చట
పూలనే దేవుళ్ళుగా… చేసేటి మెక్కట
చెట్టుచేమ కోండకోన… సుట్టూ మనకు సుట్టాలు
నిండు తొమ్మిదొద్దుల్లల… కలుసుకుంటే నేస్తాలు
గంగ ఒడిలో బతుకమ్మ… ఓ ఓ ఓ ఓ
గంగ ఒడిలో బతుకమ్మ… పాలపిట్టై చేరగా… ఓ ఓ ఓ ఓ
ఊరంతా రంగు రంగుల సింగిడాయే… వాడంతా పండగొస్తే సందడాయే
అందాలే కొత్త విందు చేసినాయే… బందాలే చేరువయిన రోజులాయే