Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Manchu Kondallona Chandrama Song Lyrics In Telugu – Taj Mahal

మంచు కొండల్లోన చంద్రమా… చందనాలు చల్లిపో
మెచ్చి మేలుకున్న బంధమా… అందమంతా అల్లుకో
మొగ్గ ప్రాయంలో, సిగ్గు తీరంలో… మధురమీ సంగమం
కొత్త దాహంలో, వింత మోహంలో… మనదిలే సంబరం
పల్లవించుతున్న ప్రణయమా… మళ్లీ మళ్లీ వచ్చిపో
విన్నవించుకున్న పరువమా… వెన్నముద్దులిచ్చిపో
కొంటె రాగంలో, జంట గానంలో… వలపుకే వందనం

ఓహోహో…
ఊపిరల్లె వచ్చి… ఊసులెన్నొ తెచ్చి
ఆడిపాడి పేద గుండె… తట్టు తట్టు తట్టు తట్టు
నింగి రాలిపోని… నేల తూలిపోని
వీడిపోని ప్రేమగూడు… కట్టి కట్టి కట్టి కట్టి
తోడై నువ్వుంటే… నీడై నేనుంటా
లోకం నువ్వంటా… ఏకం కమ్మంటా

వలచి మరుజన్మలో… గెలిచి నిను చేరనా
యుగము క్షణమై సదా… జగము మరిపించనా
వెయ్యేళ్లు వర్ధిల్లు… కరగని, చెరగని, తరగని ప్రేమలలో

పల్లవించుతున్న ప్రణయమా… మళ్లీ మళ్లీ వచ్చిపో
మంచు కొండల్లోన చంద్రమా… చందనాలు చల్లిపో

వెన్నెలమ్మ మొన్న… కూనలమ్మ నిన్న
కన్నె వన్నెలన్ని చూసే… గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి
గున్నమావికొమ్మ… సన్నజాజి రెమ్మ
ముచ్చటాడే నిన్ను నన్ను… మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి
చిందే సింగారం… సిగ్గే సింధూరం
పొందే వైభోగం… నాదే ఈ భాగ్యం

కలయికల కావ్యమై… కలలు చిగురించెనా
శ్రుతిలయల సూత్రమై… ప్రియుని జత కోరనా
ఏడేడు లోకాల ఎల్లలు దాటిన… అల్లరి ప్రేమలలో

మంచు కొండల్లోన చంద్రమా… చందనాలు చల్లిపో
పల్లవించుతున్న ప్రణయమా… మళ్లీ మళ్లీ వచ్చిపో
మొగ్గ ప్రాయంలో, సిగ్గు తీరంలో… మధురమీ సంగమం
కొంటె రాగంలో, జంట గానంలో… వలపుకే వందనం
ఆహా హా ఆహాహా……..

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks