ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చీకటిలో ఉన్నా… దారే లేకున్నా
నీకే నువ్వు తోడై ఉండి… లే త్వరగా
బలమే లేకున్నా… బాధే అవుతున్నా
ఆశే నీలో నింపుకోరా ఊపిరిగా
కన్నుల్లో నీటి చుక్కే ఉన్నా గాని
నవ్వేసి చూడు రెయిన్బో రంగుల్లని
నెలవంకా లాగ చిక్కిపోయినా గాని
వెన్నెల పంచు పున్నమిలా
మంచి రోజులొచ్చాయి
ఓ మంచి రోజులొచ్చాయీ
మంచి రోజులొచ్చాయి
అందరికీ మంచి రోజులొచ్చాయీ
హో, నింగి నేలకే దూరం ఎంత
దూకేస్తే ధైర్యంగా ఓ చినుకంతా
నమ్మకమే నీకుంటే విత్తనమంతా
చిగురించవా చెట్టంతా
మండే ఎండకేం వెనుకడుగెందుకు
పెరిగే నీడలా పదా ముందుకు
ఈరోజే మళ్ళీ పుట్టి వేకువలా
మంచి రోజులొచ్చాయి, వచ్చాయి
ఓ మంచి రోజులొచ్చాయీ, ఈ ఈ, వచ్చాయి
మంచి రోజులొచ్చాయి
అందరికీ మంచి రోజులొచ్చాయీ, ఈ ఈ, వచ్చాయి
Like and Share
+1
+1
+1