Menu Close

Manasa Palakave Song Lyrics In Telugu – Subhakankshalu


Manasa Palakave Song Lyrics In Telugu – Subhakankshalu

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై
మనసా పలకవే… మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే… చిగురాశల గీతికవై
మంచుతెరలే తెరుచుకుని… మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా… ఓఓ ఓ ఓఓ ఓ ఓ, ఆ ఆఆ ఆఆ

తుమ్మెద తుమ్మెద విన్నావమ్మా
నిన్ను ఝుమ్మంటు రమ్మంది రంగేళి పూవమ్మా
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై

నాలో కులుకుల కునుకును రేపి… లోలో తెలియని తలపులు రేపి
పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది, ఓఓ ఓఓ ఓ ఓ ఓ
నీలో మమతల మధువుని చూసి… నాలో తరగని తహతహ దూకి
నీకై గలగల పరుగులు తీసి చేరే వేగమిది
ఆరారు కాలాల వర్ణాలతో… నీరాజనం నీకు అందించనా
ఏడేడు జన్మాల బంధాలతో… ఈ నాడు నీ ఈడు పండించనా
మరి తయ్యారయ్యే ఉన్నా వయ్యారంగా… సయ్యంటు ఒళ్ళోకి వాలంగా
దూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా… చిన్నారి వన్నెల్ని ఏలంగా
ప్రతిక్షణం పరవశం కలగగా… ఓఓ ఓ ఓఓ ఓ ఓ
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై

హాయిరబ్బ హాయిరబ్బ… హాయి హాయి హాయి హాయి
హాయిరబ్బ హాయిరబ్బ… హాయి హాయి హాయి హాయి
హాయిరో హాయిరో… హాయి హాయి హాయి హాయి
ఆ ఆ ఆఆ ఆ ఆఆ
దీంతకు దిన్న దిన్న దిన్న… దీంతకు దిన్న దిన్న దిన్న

ఆడే మెరుపుల మెలికల జానా… పాడే జిలిబిలి పలుకుల మైనా
రాలే తొలకరి చినుకులలోనా తుళ్ళే తిల్లానా
వేగే పదముల తపనలపైనా… వాలే చినుకుల చెమటల వానా
మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళానా
బంగారు శృంగార భావాలతో… పొంగారు ప్రాయాన్ని కీర్తించనా
అందాల మందారహారాలతో… నీ గుండె రాజ్యాన్ని పాలించనా
ఇక వెయ్యేళ్ళైనా నిన్ను విడిపోనంటూ… ముమ్మారు ముద్దాడి ఒట్టేయ్యనా
ఇక వెళ్ళాలన్నా ఇంక వీల్లేదంటూ… స్నేహాల సంకెళ్ళు కట్టేయనా
కాలమే కదలక నిలువగా… ఓఓ ఓ ఓఓ ఓ ఓ

మనసా పలకవే… మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే… చిగురాశల గీతికవై
మంచుతెరలే తెరుచుకుని… మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా… ఓఓ ఓ ఓఓ ఓ ఓ

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading