Menu Close

ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నావా – Make Your Bed – Book Recommendations


ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నావా – Make Your Bed – Book Recommendations

పుస్తకం పేరు: Make Your Bed: Little Things That Can Change Your Life… And Maybe the World
రచయిత: అడ్మిరల్ విలియం హెచ్. మెక్‌రవెన్ (Admiral William H. McRaven)

“ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నావా?
అయితే పొద్దునే నిద్ర లేవగానే నువ్వు
నీ మంచం సర్దుకోవడం మొదలుపెట్టు.”

వినడానికి జోక్ గా వున్నా ఇందులో చాలా మాటర్ వుంది.
ఎందుకో పూర్తిగా చదివితే మీకే అర్దం అవుతుంది.

ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నావా - Make Your Bed - Book Recommendations

చీకటి సముద్రాన్ని దాటి, భయాన్ని తలదన్ని, శరీరం దెబ్బతిన్నా… మానసికంగా బలంగా నిలబడటం ఎలా?
ఒక సైనికుడి జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో.. అవే ఇక్కడ మీ కోసం.

Important points from the the book “Make Your Bed

1. మన రోజు ఎలా మొదలవుతుంది అనేదే మన జీవితం ఎలా మారబోతుందో అన్నదాన్ని కూడా నిర్ణయిస్తుంది.
2. నేడు చిన్న విజయాన్ని సాదించు చూడు → అది పెద్ద మార్పు దిశగా నిన్ను నడిపిస్తుంది.
3. మొదటి టాస్క్ కంప్లీట్ చేస్తే.. అది ఎంత చిన్నదైనా, నీకు “నేను చేయగలను!” అనే నమ్మకం కలుగుతుంది.
4. ప్రపంచం సులభంగా నీకేమీ ఇవ్వదు, నీకు కావలిసిందంతా నువ్వే కష్టపడి సాధించాలి.
5. టీమ్ తో కలిసి పనిచేయగలగడం నేర్చుకోవాలి, అది నీకు పెద్ద పెద్ద విజయాలను ఇస్తుంది.

6. నీ ఫెయిల్యూర్ నిన్ను బలంగా తయారుచేస్తుంది. ఓడినా మళ్ళీ లేచే ధైర్యం ఉన్నవాడే అసలైన విన్నర్.
7. ఎవరూ లేనపుడు, ఎవరు నిన్ను చూడనప్పుడు కూడా నీ పని నువ్వు నిబద్ధతతో చేయాలి.
8. నీకు పెద్ద దెబ్బ తగిలినపుడు కూడా నవ్వగలిగితే, నీవు గెలిచినట్లే.
9. నువ్వు ఎంత చిన్నవాడివైనా, నీ ధైర్యం పెద్దదైతే… ఎవరూ నిన్ను ఆపలేరు.
10. జీవితం నీ ముందు అడ్డంకులు పెడుతుంది, అవి నువ్వు ఆగిపోవడానికి కాదు, వాటిపై నుండి దూకేందుకు.

11. చీకట్లో ప్రయాణించే వాళ్లే, వెలుగుని బలంగా చూడగలరు.
12. నీకేమైనా కావాలంటే… ఎవరిని అడగకుండా దాని కోసం కష్టపడు.
13. మీ పనిని ఎవరు గుర్తించకపోయినా, నువ్వు గౌరవంగా చేయాలి.
14. బాధ్యత తీసుకునే ధైర్యం కలిగినవాడే నమ్మదగినవాడు.
15. మీరు ప్రతి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాల్సిన పని లేదు – కానీ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే వుండాల్సిన అవసరం ఉంది.

16. ప్రపంచాన్ని మారుస్తానని బలంగా అనుకునే ముందు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి .
17. నువ్వు ఇతరుల జీవితం మీద చిన్న ప్రభావం చూపగలిగితే అదే నీకు అసలైన విజయం.

“నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి అనుకుంటే, ముందు నీ జీవనశైలినే మార్చుకొ.”
“గొప్ప పని చేయకపోయినా పర్లేదు కానీ ప్రతి చిన్న పనిని గొప్పగా చేయగలిగితే నువ్వే గ్రేట్!”

ఈ పుస్తకాన్ని తెలుగులో ఇక్కడ పూర్తిగా చదవండిMake Your Bed in Telugu

ఫోకస్డ్ గా పని చెయ్యడం ఎలా – Deep Work Explained in Telugu – Book Recommendations

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading