Menu Close

Maina Emainave Song Lyrics In Telugu – Maa Annayya


Maina Emainave Song Lyrics In Telugu – Maa Annayya

మైనా ఏమైనావే… మన్మథ మాసం
అయినా ఎంతైనా… ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక… తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక… నీవు లేక లేనిక
సాగు అల్లిక… కొనసాగనీ ఇక
పూల మాలిక… చెలి పూజకే ఇక

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

విరహాల నిట్టూర్పు… విరజాజి ఓదార్పు
చలి గాలి సాయంత్రాల స్వాగతమే
పైపైకొచ్చే తాపాలు… పైటమ్మిచ్చే శాపాలు
ఎదతోనే ముందుగ చేసే కాపురమే
ఎవరేమైనా, ఆ ఆ, ఎదురేమైనా… నేనేమైనా, ఆ ఆ, నీవేమైనా
ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

సందెపొద్దు నేరాలు… అందమైన తీరాలు
దాటేస్తే కాదన్నానా ఎపుడైనా
కవ్విస్తున్న నీ కళ్ళు… కైపెక్కించే పోకళ్ళు
కాటేస్తే కాదంటానా ఇపుడైనా
వయసేమైనా సొగసేమైనా… మైమరిపించే మనసేమైనా
నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరికా తీర్చమంది కోరికా
నీకు తోడు నేనికా నీవు లేక లేనికా
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక

మైనా ఏమైనావే… మన్మథ మాసం
అయినా ఎంతైనా… ఇది మెత్తని మోసం

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading