Menu Close

Maa Logililo Pandedantha Lyrics In Telugu-Maa Annayya


మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికీ మా కంటికీ మణి దీపం ఈ రూపం
ప్రేమకు ప్రతి రూపం
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

రాముడు అడవికి వెళ్ళేనా… నువ్వే అన్నై ఉండుంటే
ఏసు శిలువ మోసేనా… నీకే తమ్ముడు అయ్యుంటే
అమ్మంటూ లేకున్నా… జన్మంతా జరిగేనులే
అన్నంటూ లేకుంటే… క్షణమైనా యుగమౌనులే
కనకున్ననూ కన్నమ్మవై… కడుపున మము దాచీ, కాచిన దైవమా
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

ఇంతటి చక్కని బంధాన్ని… కాలం ఆగి చూసేను
రాత రాయు ఆ బ్రహ్మ… రాయుట ఆపి మురిసేను
తపమేమి చేశామో… తమ్ముళ్ళం అయ్యాములే
తన బతుకే మా మెతుకై… తనయులమే అయ్యాములే
మా దేవుడు మాకుండగా… మరి మాకిక లోటేది, కలతకు చోటేది

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే… ఆ ఆఆ
మా జాబిలికి ఏడాదంతా పున్నమే… ఆ ఆఆ
ఈ ఇంటికీ మా కంటికీ మణి దీపం
ఈ రూపం ప్రేమకు ప్రతి రూపం
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే… ఆ ఆఆ
మా జాబిలికి ఏడాదంతా పున్నమే… ఆ ఆఆ

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading