ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Lovers Telugu Jokes – తెలుగు జోక్స్
దారిన వెళ్తున్న ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తూ
బస్ స్టాప్ లో వున్న అమ్మాయిని చూస్తాడు.
రోజూ ఆమెను ఫాలో చేస్తూ విపరీతంగా ప్రేమించేస్తాడు.
ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు.
ఒకరోజు ఆ అబ్బాయి ఆ అమ్మాయి
వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి
తన పెళ్లి ప్రస్తావన గురించి వివరిస్తాడు.
అబ్బాయి : “చూడండి.. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను.
పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను.
మీరు గనుక తనను నాకిచ్చి పెళ్లి చేస్తే..
తను ఎంత బరువుంటుందో అన్ని కిలోల బంగారాన్ని మీకిస్తాను”
ఈ మాటలు వినగానే అమ్మాయివాళ్ల నాన్న
దీర్ఘంగా ఆలోచనలో పడిపోతాడు.
అమ్మాయివాళ్ల నాన్న : “కానీ నాక్కొంచెం సమయం కావాలి”
కొన్నిరోజుల తరువాత ఆ అబ్బాయి తిరిగి
అమ్మాయివాళ్ల నాన్నతో కలుస్తాడు.
అబ్బాయి : “నేను పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాను.
మీరింకా ఏమైనా ఆలోచిస్తున్నారు. చెప్పండి”
అమ్మాయివాళ్ల నాన్న : “లేదు… వేరే విషయాలు ఆలోచించడానికి ఏమీలేదు..
కానీ మా అమ్మాయి ఇంకొంచె బరువు పెరగడానికి నానా ఇబ్బందులు పడుతున్నాం,
ఇంకొన్ని రోజులు ఆగితే బాగుండు అని 🤣🤣“
Lovers Telugu Jokes
నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣