కొన్ని సార్లు తగ్గడం కూడా ఒక గొప్ప వ్యూహమే – లైఫ్ లెసన్స్ – Life Lessons in Telugu
జీవితంలో విజయం అంటే ప్రతిసారి ఎదిరించడం, ఎదురుదాడి చేయడం మాత్రమే కాదు, కొన్నిసార్లు తగ్గడం కూడా ఒక గొప్ప వ్యూహమే.. అసలు నిజమైన గెలుపు బలంతో సాధించేది కాదు, అది సమయస్ఫూర్తితో, సహనంతో, తెలివితో గెలుచుకోవాల్సినది.

వేమన పద్యంలో దాగిన జీవన సత్యం
“అణువు గాని చోట అధికుల మనరాదు,
కొంచెం ఉండుటల్ల కొదవ కాదు,
కొండ అద్దం ముందు కొంచెం అయి ఉండదా?
విశ్వదాభిరామ వినురవేమ!”
ఈ పద్యం మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ఎప్పుడు ఎదగాలో, ఎప్పుడు తగ్గాలో తెలిసినవాడే చిరస్థాయిగా నిలుస్తాడు. కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గడం అంటే ఓటమి కాదు, గెలుపు కోసం తీసుకునే ఓ గొప్ప వ్యూహం!
మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఎలా ఉంటారు?
✔ వారు ప్రతీ చిన్న విషయానికి ఎగిరిపడరు, భయపడరు ధైర్యంగా ఎదుర్కొంటారు.
✔ ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో అర్థం చేసుకుంటారు.
✔ ప్రతీ అవమానాన్ని విజయం కోసం సహించగలుగుతారు.
✔ తగ్గిన ప్రతీసారి భవిష్యత్తులో మరింత బలంగా ఎదుగుతారు.
జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజం మన చేతిలో ఉన్నప్పటికీ, దాన్ని వెంటనే బయట పెట్టలేం. సరైన క్షణం కోసం ఎదురు చూడు. ఏదో ఒక రోజు, పరిస్థితి తిరగబడుతుంది. అప్పుడు మన నిశ్శబ్దం కూడా సమాధానం అవుతుంది.
మీ అనుభవం ఏమిటి? కామెంట్ చెయ్యండి.!
మరిన్ని ఇక్కడ చూడండి👇
అందాన్ని ఎర వేస్తారు జాగ్రత్త, ఆ వలలో పడకు.
నీ ప్రయత్నం ఎంత చిన్నదైనా పర్లేదు, కానీ నీ ప్రయత్నం ఆపకు.