అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
వ్యక్తిత్వమే మనిషికి ఆభరణం – Life Lessons in Telugu
గంజి నీళ్లు త్రాగి బ్రతికిన పర్వాలేదు కానీ,
ఇతరులు జాలిపడే విధంగా బ్రతకకు,
నిన్ను చూసి పదిమంది గర్వపడే విధంగా బ్రతుకు.
ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కుతినకు..
అవసరమైతే నిన్నటి రొట్టెను ఈరోజు నీటిలో నానబెట్టి అయినా
నీ ఆకలి తీర్చుకో కానీ.. చేయి చాచకు.

మాట చాలా విలువైనది.
సాధ్యమైనంతవరకు ఆ మాటను నిలుపుకునే విధంగా
మన అడుగులు వేయాలి.
డబ్బు సంపాదించవచ్చు కానీ, వ్యక్తిత్వం కోల్పోతే…
మాట పోతే మళ్లీ తిరిగి రాదు.
ఇచ్చిన మాటను నిలుపుకోవడంలోనే
మన నిజాయితీ, మన సంస్కారం,
మన వ్యక్తిత్వం ఇమిడి ఉంటుంది.
వ్యక్తిత్వాన్ని కోల్పోతే
జీవితంలో సర్వం కోల్పోయినట్టే,
వ్యక్తిత్వమే మనిషికి ఆభరణం.
వ్యక్తిత్వాన్ని కోల్పోతే..
అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఉంటుందా..?
మానవ జన్మ ఎత్తిన నీవు అమృత పుత్రుడవు.
భగవంతుని గారాల తనయుడవు..
అనే విషయాన్ని మర్చిపోకు.
ఒకవేళ నీవు తలదించి అడుక్కుంటే..
నీలో ఉన్న పరమాత్మ కూడా తలదించుకున్నట్టే..
ఎంతటి సమస్య అయినా ప్రయత్నించు..
ఫలితం దైవం మీద వదిలేయ్.
సింహ ఓలే జీవించు, పిల్లి లాగా మరణించకు..
జీవితంలో సింహా వృత్తి ని జాగృతం చేయండి..
జీవితం అశాశ్వతం అని తెలుసు..
అలాంటప్పుడు ఎందుకు ఇంత వెంపర్లాటా..
నీ యొక్క కర్తవ్యం ప్రయత్నం చేస్తూనే ఉండాలి..
తప్పకుండా ఆ దైవం యొక్క సహకారం నీకు అందుతుంది.
ఇందులో ఎలాంటి సందేహం లేదు.
దానికి కావాల్సింది అకుంఠితమైన ఆత్మవిశ్వాసం.
ఇవి కూడా చదవండి.
నీకు సమస్య వచ్చినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులను గమనించు
చిన్న చిన్న నిర్ణయాలే జీవితాన్ని అందంగా మారుస్తాయి
ఆనందమైన జీవితానికి ఆరు సూత్రాలు