Life Lessons in Telugu: మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితాన్ని ఇంకా అందంగా మారుస్తాయి.
రేపు ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి ఊరు వెళ్ళాలి.
ఈ మాట అనుకోగానే మా అమ్మాయి వచ్చి
నాన్నా నీకోసం నేను, నువ్వు త్వరగా లేవడానికి అలారం పెడతాను అంది.
నేనే అలారం పేట్టుకుంటానమ్మా నీకెందుకు అంటే చిన్నబుచ్చుకుంటుంది.
అలాగే తల్లి అలారం పెట్టు నాకోసం అంటే చాలా సంతోషపడింది.
నాన్న చేసే పనిలో తన భాగస్వామ్యం ఉందన్న త్రుప్తి తనకి.

ఆఫీస్ లో నేను రాసిన లెటర్ కి చిన్న చిన్న కరక్షన్లు మా బాస్ చెప్పాడు.
ఆ కరక్షన్లు అవసరం లేదని నాకు తెలుసు, మా బాస్ కి తెలుసు.
అవి అక్కరలేదంటే బాగోదు.
ఆయన చెప్పిన కరక్షన్లు చేసి లెటర్ తీసికెడితే
మా అమ్మాయి నాకోసం అలారం పెట్టమన్నపుడు ఎంత సంతోష పడిందో అంత సంతోషపడ్డాడు.
జీవితంలో కొన్ని కొన్ని సార్లు కొంతమందితో వ్యతిరేకించకుండా అంగీకరిస్తూ పోతే జేవితం ఇంకా అందంగా మారుతుంది.