1) డోర్ బెల్ కి టక్కున అటెండ్ అవ్వడం.
2) సీరియల్స్ సా….గేటప్పుడు ఫోన్లు మాట్లాడకుండా నిశ్శబ్దముగ ఉండి….సీరియల్స్ ఐపొయ్యాకే నీ న్యూస్ అదీ చిన్న వాల్యూమ్ లో చూడటం.
3) డోర్ దగ్గర పడి ఉన్న న్యూస్ పేపర్ ను వెంటనే చదివేయాలి…లేదంటే,” పేపర్ మానేద్దాం, చదవరు పెట్టరు డబ్బు వేస్ట్ ” అని వినపడుతోంది.
4) భార్య చెపితే (ఆమె కి కోపము వచ్చినప్పుడు మాత్రమే) పిల్లలను తిట్టి కంట్రోల్ చేయడం.
5) అటక పైన పెట్టిన సామాను కిందికి దించడం.
6) స్టవ్ మీద పెట్టిన పాలు పొంగబోయే ముందే ఎంతో తెలివిగా స్టవ్ ఆఫ్ చేసి పొంగిపోవటం…కానీ పాలు
పొంగిపోతే…..!!
7) గట్టిగా మూత బిగుసుకు పోయిన సాస్,జామ్, తేనె బాటిల్స్ మూతలు ఓపెన్ చేసివ్వడం.
8) స్టవ్ మీదున్న కుక్కర్ వేసే విజిల్స్ లెక్కబెట్టి 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయడం.
9) ఇంట్లో బల్లి, బొద్దింకల వంటి భయంకరమైన జీవులను “ఒక్క మాగాడిలా” కొట్టి బయట పడేయడం.
10) సిలెండర్ ఖాళీ అయిన వెంటనే మార్చడం.
11) షాపింగ్ చేసేటప్పుడు భూదేవి కున్న ఓర్పు తో భార్య వెంట ఏ షాప్ అంటే ఆ షాపులోకి ఎన్ని గంటలైనా వెళ్లి కొన్నదానికి నోర్ముసుకొని బిల్ పే చేయడం.
12) ఇంట్లో చిన్న చిన్న ఎల్కట్రిక్, ప్లంబింగ్ పనులు నేర్చుకుంటూ….చేయడం. సరిగ్గా చేయలేకపోతే….!!
13) తనని “ఇంకా” అందంగా ఉన్నావని మధ్య మధ్య లో పొగుడుతూ ఉండటం.
14)సెల్ ఫోన్, ఇంటర్నెట్, సిటీ కేబుల్ బిల్లులు సరిఅయిన టైం లోపల కట్టి….తనకు కోపము రాకుండా చూసుకోవడం.
15) కొబ్బరికాయల పీచు తీసి ఇవ్వటం.
16) అయిదు వందలు, రెండు వేలు నోట్లకు క్షణాల్లో చిల్లర తెచ్చి పెట్టటం.
17) మళ్ళీ ఒక్కో సారి, తనకు పర్సు లో తేలిగ్గా ఉండటానికి వందనోట్లన్నీటి బదులు పెద్ద నోట్లు ఏర్పాటు చేసి పెట్టటం.
ఈ 17 పనులు చక్కగా నిర్వహించడం రిటైర్ అయిన భర్త కనీస కర్తవ్యం.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.