ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Latest Telugu Jokes
సరదాగా కాసేపు….
ఓ కాలనీలో ఒక పది మంది మహిళలు రోజు కూరగాయలు అమ్మే వాడి దగ్గర కావాల్సిన కూరగాయలు కొని వారంలో ఒక రోజు డబ్బులు ఇచ్చేవారు.
ఒకసారి ఈ మహిళలందరు మాట్లాడుకుంటుండుగా ఈ కూరగాయల డబ్బుల లెక్కల విషయం చర్చలోకి వచ్చింది “అది కాదూ…ఈ కూరగాయలు అమ్మే వాడికి మన పేర్లు తెలియదుకదా, మరీ కరెక్ట్గా మనం ఏమి తీసుకున్నామో వాటి లెక్కేంతో వాడు ఆ చీటీ ఎలా రాసుకుంటున్నాడంటావ్ వదినా “అని.
ఎంత ఆలోచించిన అర్ధం కాక, ఈ సారీ వాడి చీటి లాక్కొని చూద్దాం అని గట్టిగా అనుకున్నారు.
తరువాత రోజు రోజూ లాగే ఈ మహిళలందరు ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళు కొనుకున్న తర్వాత.. ముందుగా అనుకున్న ప్రకారం, కూరగాయలమ్మె వాడి లెక్కల చీటిని గబుక్కున లాక్కొని దూరంగా వెళ్ళి అందరూ అందులో వీడి లెక్కలు రాసుకుంటున్నాడో చూసి కోపంతో 🙄ఊగిపోయారు. అందులో
చింపిరి జుట్టుది :₹200
గయ్యాలనోటిది :₹150
మిడిగుడ్లది :₹250
చీరల పిచ్చిది :₹200
ఏడుపు గొట్టుది :₹150
పీనాసిది :₹100
శాపనార్దలాది :₹200
సీరియల్ల గోలది :₹150
బుర్ర తినేది ₹300
ఇలా అన్నీ క్లియర్ గా ఉన్నాయి మరి….!