Menu Close

Latest Telugu Jokes -103 – తెలుగు జోక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Latest Telugu Jokes – తెలుగు జోక్స్

బామ్మగారూ!
జనాభా లెక్కల సేకరణ కు వచ్చిన అధికారిని,
దయచేసి ఇంట్లో వాళ్ళని పిలవండి!
ఏవండీ,ఇంట్లో ఎవరూ లేరా?

బామ్మగారు:
ఏరా భడవా?
నేనెవర్నీ? పని మనిషిననుకున్నావా?
లేక ఇంకేమనుకుంటున్నావో చెప్పు త్రాష్టుడా?

అధికారి:
అయ్యో బామ్మగారూ, నన్ను క్షమించండి,
ఈ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు?

బామ్మగారు: డజన్

అధికారి: డజనా? ఓహ్, పన్నెండు మందా.
సరే, పెద్దాయన ఏంజేస్తుంటారు?

బామ్మగారు: జైలు కెళ్ళాడు

అధికారి:
జైలు కెళ్ళారా?
ఏం నేరం చేసారు?
ఎన్నేళ్ళు శిక్ష పడింది?
కఠిన శిక్షా లేకసాధారణ శిక్షా?

బామ్మగారు:
నీ మెుహం మండా, వాడు జైలరు

అధికారి: ఓహ్ !
అలానా, ఆయనకు ఎంతమంది పిల్లలు?

బామ్మగారు: ఓక పోతు, రెండు పెంటిపోతు,

అధికారి: పెంటి ఏంటండీ?

బామ్మగారు:
వెధవా! అదికూడా తెలవకుండా ఎలా ఆఫీసర్వయ్యావు?
ఆఫ్రాచ్రుడా! ఓ మగ,ఇద్దరు ఆడ.

అధికారి:
బామ్మగారూ! మీరు మరీ అమర్యాదగా మట్లాడుతున్నారు,
ఇప్పుడు చెప్పండి, వారి అబ్బాయి ఏం జేస్తుంటాడు?

బామ్మగారు: కొంపలార్పుతుంటాడు

అధికారి:
ఛ ఛ అదేం పనండీ?
మీరైనా చెప్పలేక పోయారా?

బామ్మగారు:
నువ్వు పరీక్ష పేసయ్యేవా?
దొడ్డిదారిన అధికారివయ్యావా బడుద్దాయ్?
వాడు ఫైర్ డిపార్ట్ మెంట్ రా అరకాణీ వెధవా !

అధికారి:
బామ్మ గారూ! మీరు సరిగ్గా చెప్పండి,
ఇలా డొంకతిరుగుడు నాకర్థం కాదండీ,
మీరు మరీ తిట్టేస్తున్నారు,

బామ్మగారు:
ఈ మాత్రం తెలియని వాడివి నువ్వేం ఆఫీసరువురా?
పింజారీ వెధవ

అధికారి:
బామ్మ గారూ! ఇక చాలు, మరి ఆడపిల్లలు ఏం చేస్తారో సూటిగా చెప్పండి, దయచేసి..

బామ్మగారు:
ఒకత్తేమో ఊడబెరుకుతుంటుంది, ఇంకోకత్తేమో తైతక్కలాడుతుంది.

అధికారి:
బామ్మగారూ! ఊడబెరకడం, తైతక్కలాడడం ఏందండీ?

బామ్మగారు:
ఒకతి పళ్ళ డాక్టర్,
ఇంకోతి భరతనాట్యం మాస్టర్ రా
నెలతక్కువ వెధవా!

అయ్యో పాపం స్ప్రహ తప్పేట్టున్నావే,
ఇలా కూర్చుని తగలడు,
ఇంత చద్దన్నం,
రవ్వంత ఆవకాయ పెడతాను తిని చావు.

Latest Telugu Jokes – తెలుగు జోక్స్

Like and Share
+1
1
+1
3
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading