మొగుడు పెళ్ళాల జోక్స్ – Telugu Jokes
ఇంటి అల్లుడు….
వయస్సు లో చిన్న వాడే అయినా….
“అల్లుడు గారు” అనే పిలుస్తారు !!
ఎందుకంటే….
మన దేశం లో ….
ఇతరుల కోసం , ….
తన జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళని……….
గౌరవించటం అనాది గా వస్తున్న …
ఆచారం!!
ఒకరోజు కొత్తగా పెళ్లయిన ఒక భార్య తన భర్త ఇంటికి రాగానే ఇలా అంటుంది.
భార్య : నా దగ్గర నీకోసం ఒక మంచి వార్త వుంది. చాలా త్వరలోనే మనం ఇద్దరం నుంచి ముగ్గురు కాబోతున్నాము.
ఈ మాట వినగానే భర్త ఎంతో సంతోషంగా భార్యతో ఇలా అంటాడు.
భర్త : అరె నా ప్రియమైన భార్య.. ఇప్పుడు నేను ఈ ప్రపంచంలోనే అందరికంటే అదృష్టవంతుణ్ణి!
భార్య : మీరు ఈ విధంగా సంతోష పడతారని నేను అనుకోలేదు. నాక్కూడా చాలా ఆనందంగా వుంది. రేపు ఉదయాన్నే మా అమ్మగారు మనతో వుండడానికి ఇక్కడికి వస్తున్నారు!
ఈ మాట వినగానే భర్తకు కళ్లు బైర్లుకమ్మి, కోమాలోకి వెళ్లిపోతాడు.
మొగుడు పెళ్ళాల జోక్స్ – Telugu Jokes
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.