Menu Close

Latest Cricket Rules in Telugu – క్రికెట్ రూల్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Latest Cricket Rules in Telugu – క్రికెట్ రూల్స్

కాచ్ ఔట్ – నో స్ట్రైక్ చేంజ్: స్తుతం ఓ ఆటగాడు క్యాచ్ ఔట్ అయితే.. ఫీల్డర్ క్యాచ్ పట్టేలోపు ఇద్దరు బ్యాట్స్‌మెన్లు క్రాస్ అయితే.. నాన్ స్ట్రైకింగ్ బ్యాట్స్‌మెన్‌కు స్ట్రైకింగ్ వచ్చేవాడు. అయితే ఇందులో ఎంసీసీ చిన్న మార్పు చేసింది. ఇక నుంచి బ్యాట్స్‌మెన్ క్యాచ్ ఔట్ అయితే.. కొత్తగా వచ్చే బ్యాట్స్‌మెన్ స్ట్రైకింగ్ చేయాల్సి ఉంటుంది. ఓవర్ చివరి బంతికి బ్యాట్స్‌మెన్ ఔట్ అయితే.. యాథావిధిగా నాన్ స్ట్రైకింగ్ బ్యాట్స్‌మెన్‌కు స్ట్రైకింగ్ వస్తుంది.

మన్కడింగ్‌‌ : మన్కడింగ్‌‌ ఇకపై క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదని ఎంసీసీ ప్రటించింది. 2019 ఐపీఎల్‌లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా రవీంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. ఇది అప్పట్లో పెద్ద దూమారమే రేపింది. అయితే కొందరు అశ్విన్‌ను సమర్థిస్తే.. మరికొందరు విమర్శించారు. ఇకపై మన్కడింగ్‌ను లా-41 క్రీడాస్పూర్తికి విరుద్ధం నుంచి లా-38 ప్రకారం రనౌట్‌‌గా మార్చారు.

cricket

వైడ్ బాల్ : వైడ్ బాల్ విషయంలోనూ ఎంసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ లా 22.1 ప్రకారం ఇక నుంచి బ్యాటర్ నుంచి బౌలర్ వేసే బంతి కొంచెం దూరం వెళ్లినా.. దానిని వైడ్ బాల్‌గా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఫీల్డ్‌లోకి బయటి వ్యక్తులు రావడం, జంతువులు వచ్చినప్పుడు బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తున్నారు. అయితే ఇక నుంచి అంపైర్ నిర్ణయం తీసుకుంటారని ఎంసీసీ చెప్పింది. ఫీల్డ్ గానీ.. ఆటగాళ్లకు గానీ ఇబ్బంది కలిగితేనే డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు.

ఉమ్మకూడదు: గతంలో బంతిని స్వింగ్ అయ్యేందుకు బౌలర్లు, ఫీల్డర్లు బంతికి లాలాజలం పూసేవారు. అయితే కరోనా సమయంలో దీనిపై నిషేధం విధించారు. అయితే ఇక నుంచి దీనిని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. బంతిపై ఇక నుంచి లాలాజలం పూయకూడదని రూల్స్ విధించింది. కాగా.. ఇప్పటికే ఉమ్మి రాయడంపై అంతర్జాతీయ క్రికెట్‌లో నిషేధం ఉంది.

మరిన్ని రూల్స్:

లా 41.5.1: ఈ నిబంధన ప్రకారం బౌలింగ్‌ జట్టులోని ఒక ఫీల్డర్‌.. బ్యాటర్‌ బంతి ఆడడానికి ముందు లేదా ఆడిన తర్వాత .. ఉద్దేశపూర్వకంగా తిట్టినా, దృష్టి మరల్చినా, అడ్డుకున్నా అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది.

లా 41.5.2: ఈ ఘటనపై ఫీల్డ్‌ అంపైర్‌ లేదా లెగ్‌ అంపైర్‌లో ఎవరో ఒకరు.. పీల్డర్‌ చేసింది ఉద్దేశపూర్వకమేనా లేక అనుకోకుండా జరిగిందా అన్నది పరిశీలించాలి

లా 41.5.3: ఒకవేళ ఫీల్డర్‌ లేదా బౌలర్‌ తప్పు ఉందని తేలితే.. మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లలో ఒకరు వెంటనే బౌలింగ్‌ జట్టుకు వార్నింగ్‌ ఇస్తూ డెడ్‌ బాల్‌గా పరిగణించాలి. ఇదే సమయంలో మరో అంపైర్‌కు బంతిని రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలి

cricket stadium

లా 41.5.4: ఇలాంటి బంతులను డెడ్‌బాల్‌గా పరిగణించి.. బ్యాటర్‌ను నాటౌట్‌గా పరిగణిస్తారు.

లా 45.5.5: ఫీల్డర్‌ లేదా బౌలర్‌.. బ్యాటర్లతో ఫిజికల్‌గా ఏమైనా ఇన్వాల్వ్‌ అయ్యారా లేదా అని పరిశీలించాలి. ఒకవేళ ఫిజికల్‌ అని తేలితే.. లా 42 ప్రకారం(ఆటగాడి నిబంధన ఉల్లంఘన) ప్రకారం యాక్షన్‌ తీసుకోవాలి

లా 45.5.6: బౌలింగ్‌ జట్టు తప్పు ఉందని తేలితే.. ఫీల్డ్‌ అంపైర్‌ బ్యాటింగ్‌ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. ఆ తర్వాత ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు బౌలింగ్‌ జట్టు కెప్టెన్‌కు వివరిస్తారు.

లా 45.5.7: బౌలర్‌ వేసిన బంతిని పరిగణలోకి తీసుకోరు.. డెడ్‌బాల్‌గా కౌంట్‌ చేస్తారు.

లా 45.5.8: ఈ తతంగమంతా జరిగే లోపల బ్యాటర్లు పరుగు తీస్తే.. దానిని రద్దు చేయడం జరుగుతుంది. అదే సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లు సగం క్రీజు దాటితే మాత్రం​ పరుగు ఇవ్వడంతో పాటు అదనంగా ఐదు పరుగులు ఇస్తారు.

లా 45.5.9: స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్‌ తర్వాత బంతిని తాను ఆడాలా లేక నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ ఆడాలా అనే నిర్ణయం వాళ్లే తీసుకునే అవకాశం.

లా 45.5.10: ఆటలో భాగంగా జరిగిన తప్పిదాన్ని మ్యాచ్‌లో పాల్గొన్న ఇద్దరు అంపైర్లు రాతపూర్వకంగా గవర్నింగ్‌ కౌన్సిల్‌కు అందజేయాల్సి ఉంటుంది. బౌలింగ్‌ జట్టుపై ఏ యాక్షన్‌ తీసుకున్నారనేది వివరించాలి.

Latest Cricket Rules in Telugu – క్రికెట్ రూల్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading