Menu Close

Laali Laali Anu Raagam Song Lyrics In Telugu – Indira

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ… ఆ ఆఆ ఆ
లాలి లాలి అను రాగం… సాగుతుంటే
ఎవరూ నిదుర పోరే…
చిన్నపోదా మరి… చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు… వీచే గాలులకు
హృదయం కుదుట పడదే…
అంత చేదా మరి… వేణు గానం
కళ్ళు మేలుకుంటే… కాలమాగుతుందా, భారమైన మనసా
ఆఆ… పగటి బాధలన్నీ… మరచిపోవుటకు ఉంది కాదా
ఈ ఏకాంత వేళ…

లాలి లాలి అను రాగం… సాగుతుంటే
ఎవరూ నిదుర పోరే…
చిన్నపోదా మరి… చిన్ని ప్రాణం

స మ గ ప ప మ ప మ… గ రి గ రి స ని
స మ గ ప ప మ ప మ…
స మ గ ప ప మ ప మ… గ రి గ రి స ని
స మ గ ప స ర మ…
ఆఆ ఆ…
గ మ ద ద మ ని ని ద… స రి స ని ద ప
గ మ ద ద మ ని ని ద… గ రి స ని ద ప మ ద

ఎటో పోయేటి… నీలి మేఘం
వర్షం చిలికి వెళ్ళసాగే…
స రి గ రి గ గ రి గ ప మ గ
ఏదో అంటుంది… కోయల పాట
రాగం ఆలకించారా…
స రి గ రి గ గ రి గ ప మ గ
అన్ని వైపులా మధువనం… పూలు పూయదా అనుక్షణం
అణువణువునా జీవితం… అందచేయదా అమృతం

లాలి లాలి అను రాగం… సాగుతుంటే
ఎవరూ నిదుర పోరే…
చిన్నపోదా మరి… చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు… వీచే గాలులకు
హృదయం కుదుట పడదే…
అంత చేదా మరి… వేణు గానం

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading