ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Krupagala Deva Lyrics In Telugu – Telugu Christian Songs
కృపగల దేవా దయగల రాజ
కృపగల దేవా దయగల రాజ
చేరితి నిన్నే బహుఘన తేజ
నీ చరణములే నే కోరితిని
నీ వరములనే నే వేడితిని ||2||
సర్వాధికారి నీవే దేవా… నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి… ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా
కృపగల దేవా దయగల రాజ
చేరితి నిన్నే బహుఘన తేజ
నీ చరణములే నే కోరితిని
నీ వరములనే నే వేడితిని
త్రోవను చూపి తారవు నీవే… గమ్యము చేర్చే సారధి నీవే
జీవనయాత్ర శుభప్రదమాయే… నా ప్రతి ప్రార్థన పరిమళమాయే
నీ ఉదయకాంతిలో నను నడుపుము
నా హృదిని నీ శాంతితో నింపుము ||కృపగల||
కృప చూపి నన్ను అభిషేకించి
వాగ్దానములు నెరవేర్చినావే
బహు వింతగా నను ప్రేమించినావే
బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంత వివరింతును
నీ దివ్యమహిమలను ప్రకటింతును ||కృపగల||
నా యేసురాజ వరుడైన దేవా
మేఘాల మీద దిగివచ్చువేళ
ఆకాశవీధిలో కమనీయ కాంతిలో
ప్రియమైన సంఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో
జీవింతు నీలోనే యుగయుగములు
కృపగల దేవా దయగల రాజ
చేరితి నిన్నే బహుఘన తేజ
నీ చరణములే నే కోరితిని
నీ వరములనే నే వేడితిని