Menu Close

2022 – కొమరం భీమ్ రియల్ లైఫ్ స్టోరీ – Komaram Bheem Full Story in Telugu – Incredible

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

2022 – కొమరం భీమ్ రియల్ లైఫ్ స్టోరీ – Komaram Bheem Full Story in Telugu – Incredible

2022 - కొమరం భీమ్రి రియల్ లైఫ్ స్టోరీ - Komaram Bheem Full Story in Telugu - Incredible

1900 ల కాలంలో నిజాం తరహా అణచివేత, బ్రిటీషర్ల పాలన కొనసాగుతూ వచ్చింది. ఆ సమయంలో కొత్త చట్టాలు ఎన్నో వచ్చాయి. వ్యాపార అవకాశాలు విస్తరిస్తున్న ఆ కాలంలో వస్తున్న కొత్త చట్టాలు ఆదివాసీలకు ఇబ్బందులుగా పరిణమించాయి.

ఎంతో కాలంగా వ్యవసాయం చేస్తూ వస్తున్న ఆదివాసీలకు కొత్తగా వచ్చిన చట్టాలు చుక్కలు చూపేవి. ఎవరెవరో వచ్చి.. ఆ భూమి తమదని, ఖాళీ చేయాలనీ కోరుతూ ఉండేవారు. పండించిన పంటని లాక్కునే వారు. వడ్డీ వ్యాపారుల వలన కూడా ఇబ్బందులు వచ్చేవి.

మరోవైపు కట్టెలు కొట్టుకోవడానికి వీలు లేని పరిస్థితి ఉండేది. ఇలా ఆదివాసీల గోండు కుటుంబాలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఒకటీ, రెండూ కాదు. అలాంటి కుటుంబాల్లోనే కుమ్రం భీము కుటుంబం కూడా ఉండేది.

సంకెపల్లిలోని వ్యాపారులు, అటవీ అధికారుల కారణంగా భీము కుటుంబం కూడా చాలా బాధలను ఎదుర్కొంది. భీము తండ్రి మరణించిన తరువాత వీరి కుటుంబం సుర్దాపూర్‌లో స్థిరపడ్డారు. అక్కడ పంటలు పండించే నాటికి భీముకు 15 సంవత్సరాల వయసు వచ్చింది. 

పంట చేతికందే సమయానికి.. ఆ స్థలం నాదంటూ ఓ ముస్లిం వ్యక్తి వచ్చారు. ఆ సమయంలో భీము వారితో గొడవపడ్డారు. అంతే కాదు… సిద్ధిక్ అనే వ్యక్తి తలపై కూడా కొట్టారు. అక్కడ నుంచి పారిపోయిన కుమ్రం భీము అస్సాం చేరుకున్నారు. అక్కడే కొంతకాలం టీ తోటలో పని చేసారు. అక్కడే రాయడం, చదవడం నేర్చుకున్నారు.

దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న తిరుగుబాట్ల గురించి కుమ్రం భీము అక్కడే తెలుసుకున్నాడు. మన్నెం దొర అల్లూరి సీతారామరాజు గురించి కూడా కుమ్రం భీము తెలుసుకున్నాడని “అల్లం రాజయ్య” అనే రచయిత “కుమ్రం భీము” అనే పుస్తకంలో పేర్కొన్నారు.

2022 - కొమరం భీమ్రి రియల్ లైఫ్ స్టోరీ - Komaram Bheem Full Story in Telugu - Incredible

మన్నెం తిరుగుబాట్ల గురించి కూడా కుమ్రం భీము తన సహచరులతో చెప్తూ ఉండేవాడట. అస్సాం టీ తోటలలో పని చేసే రోజుల్లోనే అక్కడ కూడా తిరుగుబాట్లలో కుమ్రం భీము పాల్గొనే వాడట. అక్కడ నిర్బంధిస్తే.. అక్కడినుంచి తప్పించుకుని లచ్చు పటేల్ వద్ద పనిలో చేరారట.

అక్కడే.. సోమ్ బాయిని వివాహం చేసుకున్నారట. ఆ తరువాత ఆసిఫాబాద్ జిల్లా బాబెఝరి గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని 12 గ్రామాల ఆదివాసీలను కలుపుకుని అడవులని నరికి వ్యవసాయ భూములుగా సాగు చేశారట. దీనితో పోలీసులు పెద్ద విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వానికి, ఆదివాసీలకు మధ్య చర్చ నడిపే వ్యక్తిగా కుమ్రం భీము వ్యవహరించారు.

అయితే.. ప్రభుత్వం కుమ్రం భీముతో చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. దీనితో పోలీస్ బలగాలు దాడికి దిగాయి. దాదాపు ఏడు నెలల పాటు ఆ గ్రామాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఓ వైపు నిజాం సేనలు, మరోవైపు కుమ్రం భీము ఆధ్వ్యర్యంలో ఆదివాసీలు దాడులు చేసుకున్నాయి. ఊహించని విధంగా 300 ల పైగా మందుగుండు సామగ్రితో పోలీసులు కుమ్రం భీము ఉంటున్న స్థావరాలపై వెనుక వైపు నుంచి వెళ్లి దాడి చేసారు.

భీము తో పాటు మొత్తం 15 మందిని కాల్చి చంపేశారు. ఆ తరువాత మిగిలిన వారిని అరెస్ట్ చేసారు. కుర్దు పటేల్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం వల్లే కుమ్రం భీము స్థావరాలు పోలీసులకు తెలిసాయి. 1940 సెప్టెంబర్ 1 వ తేదీన కుమ్రం భీము చనిపోయారు. 1946 లో తెలంగాణ సాయుధ దళాలు ఈ కుర్దు పటేల్ అనే వ్యక్తిని కాల్చి చంపేశాయి.

2022 – కొమరం భీమ్ రియల్ లైఫ్ స్టోరీ – Komaram Bheem Full Story in Telugu – Incredible

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading