ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kola Kalla Chinnadhi Lyrics in Telugu – Chittam Maharani
ఓ ఓ ఓ, కోల కోల కోల
కోల కళ్ళ చిన్నదీ
గోల గోల గోల చేసి చంపుతున్నదీ
అరె ఏటవాలు సూపు తోనే గాలమేస్తదీ
ఏదో తారుమారు చేసి జూదమాడుతున్నదీ
గుట్టే దాచిపెట్టుకుందిరో
గట్టే దాటనియ్యకుందిరో, కేడిరో
గుట్టే దాచిపెట్టుకుందిరో, ఓ ఓ
గట్టే దాటనియ్యకుందిరో, ఓ ఓ హో
ఓ క్షణం హుషారుగుంటది
ఓ క్షణం పరాకుగా
గంటలో తుఫాను మాదిరి
మారిన ప్రశాంతతా
ఓ ఓ ఓ, కోలా కోలా కోలా
కోల కళ్ళ చిన్నదీ
గోల గోల గోల చేసి చంపుతున్నదీ
మంచులాగ ఉంటు
మంట రేపిన
కోర పళ్ళు లేని
ఆడ దయ్యమా
పూల దారి కూడా
నువ్వు కాలు పెట్టగా
మారిపోదా ముళ్ళదారిగా
రాతిరేలా చేరి జోల పాడుతూ
జల్ల కొట్టి లేపే పీడ స్వప్నమా
కాంచు కంఠమెత్తి గోలగోల చేసినా
హాయిగానే ఉందిగా
ఇంత దారుణంగా
నన్నాడుకుంటూ ఉన్నా
ఇష్టమెందుకంటే ఎలాగ చెప్పడం
కాళిదాసు కూడా కంపారిసన్లు లేక
ఆ పెన్ను పక్కనెట్టి
బుక్కు మూసి దండం వెట్టి పోడా
స్ట్రాబెర్రీ పెదాల సుందరి
రాబరీ చేసిందిరో
పోకిరి గుణాల వైఖరీ
ఊపిరే లాగిందిరో
ఓ ఓ ఓ, కోలా కోలా కోలా
కోల కళ్ళ చిన్నదీ
గోల గోల గోల చేసి చంపుతున్నదీ
Kola Kalla Chinnadhi Lyrics in Telugu – Chittam Maharani