కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓ
కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
ఉభయకుసల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే, సంచారే
అధరరుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే, మాంగళ్యే
మమతమసకు సమదససత ముదమనసుత సుమనలయివ
సుసుతసహితగామం విరహరహిత భావం
ఆనందభోగం ఆ జీవకాలం పాశానుబంధం తాళానుకాలం
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కా మయే
హృదయాన్ని తాకే… నీ నవ్వు నాదే
ఉదయాన్ని దాచే… కురులింక నావే
ఒడిలోన వాలే… నీ మోము నాదే
మధురాలు దోచే.. అధరాలు నావే
నీలో పరిమళం… పెంచిందే పరవశం
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే… ఓఓ ఓఓ ఓ హో హో
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
ఏదేదో ఆశ కదిలింది నాలో
తెలపాలనంటే సరిపోదు జన్మ
ఓఓ… ఏ జన్మకైనా ఉంటాను నీలో
ఏ చోటనైనా నిను వీడనమ్మ
కాలం ముగిసిన… ఈ బంధం ముగియునా
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే… ఓఓ ఓఓ ఓ హో హో
కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓ
కన్నల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
Very good.excellent service thank you so much
Thank you so much.
Please do subscribe to our youtube channel.
we trying to do more good stuff there.
https://www.youtube.com/c/TeluguBucketOfficial/videos