కన్నులదా ఆశలదా… బుగ్గలదా ముద్దులదా
పెనవేసుకున్న పెదవులదా… నువు కోరుకున్న సొగసులదా
మదిలో మెదిలే… వలపుల మొలకా
నాలో ప్రాణం నీవె కదా…
అలలా కదిలే… వలపుల చిలకా
అందని అందం నీదె కదా…
ఏదేదొ పాడుతూ… నా మీదే వాలుతు
హద్దుల్ని దాటుతు… మాయల్నె చేయకు
గుండెల్లొ ఆడుతు… కళ్ళల్లొ సోలుతు
నీ కొంటె చూపుల… గాలమే వేయకు
హృదయం ఉదయం కలిసెనమ్మ… వయసె విరిసెనమ్మ
అమృతం పొంగి ఆణువణువు… వలపే కురిసెనమ్మ
ముద్దుల్నె పేర్చవా… ముచ్చట్లే ఆడవా
నా మీదె చాలగ… నీ ఒడి చేర్చవా
కన్నులదో బుగ్గలదో… ముద్దులదో నవ్వులదో
మదిలో మెదిలే వలపుల మొలకా… నాలో ప్రాణం నీవెకదా
Like and Share
+1
+1
1
+1