ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kanne Pillatoti Lyrics in Telugu – Yamudiki Mogudu
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది…
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది… ఎట్టాగమ్మ
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట… ఆ… ఆ.
ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో… వచ్చి వాటేసుకో
కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో… మంచు ముద్దు ఇచ్చుకో
పల్లె అందంలో పైటే జారితే… పడుచు గంధంలో పాటే పుట్టదా.
వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో … వయ్యారంగా ఒక రోజు గడుపుకో
పాఠం… గుణపాఠం… చెలి వాటం… చెలగాటం
ఇది ఎక్కిదిగిదిగిఎక్కే యవ్వారం.
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట
ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో… నీడగా ఉండవా
పండు చిలకమ్మ పసి గట్టే వేళలో… పైటగా ఉండవా
బ్యూటి తోడుంటే ఊటి దండగ… స్వీటి కౌగిట్లో పూటా పండగ
నీ కల్లలో చెస్తాలే కాపురం. కట్టేస్తాలే నా ప్రేమ గొపురం
పాశం …యమపాశం …చలిమాసం… చెలి కోసం
ఇది కింద మీద ఉందా లేదా యవ్వారం
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది…
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది… ఎట్టాగమ్మ…
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట.ఆ… ఆహ