ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కళ్యాణం వైభోగం… ఆనంద రాగాల శుభయోగం
కళ్యాణం వైభోగం… ఆనంద రాగాల శుభయోగం…
రఘువంశ రామయ్య… సుగుణాల సీతమ్మ
వరమాలకై వేచు సమయాన…
శివధనువు విరిచాకె… వధువు మది గెలిచాకె
మోగింది కళ్యాణ శుభవీణ…
కళ్యాణం వైభోగం…
శ్రీ రామచంద్రుని కళ్యాణం…
అపరంజి తరుణి… అందాల రమణి
వినగానె కృష్ణయ్య లీలామృతం…
గుడి దాటి కదిలింది… తనవెంట నడిచింది
గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం…
కళ్యాణం వైభోగం…
ఆనంద కృష్ణుని కళ్యాణం…
పసిడి కాంతుల్లొ పద్మావతమ్మ… పసి ప్రాయములవాడు గోవిందుడమ్మా
విరి వలపు ప్రణయాల… చెలి మనసు గెలిచాకె
కళ్యాణ కళలొలికినాడమ్మా…
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు… ఋణమైన వెనుకాడలేదమ్మా
కళ్యాణం వైభోగం… శ్రీ శ్రీనివాసుని కళ్యాణం…
వేదమంత్రం అగ్ని సాక్ష్యం… జరిపించు ఉత్సవాన
పసుపుకుంకాలు పంచభూతాలు… కొలువైన మండపాన
వరుడంటు వధువంటు… ఆ బ్రహ్మముడి వేసి
జత కలుపు తంతే ఇది… స్త్రీ పురుష సంసార
సాగరపు మదనాన్ని సాగించమంటున్నది…
జన్మంటు పొంది, జన్మివ్వలేని… మనుజునకు సార్ధక్యముండదు కదా…
మనుగడను నడిపించు కళ్యాణమును మించి…
ఈ లోక కళ్యాణమే లేదుగా…
కళ్యాణం వైభోగం… ఆనంద రాగాల శుభయోగం…