ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kallaloki Kallu Petti Lyrics in Telugu-Nuvve Kavali – కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు…
మనం అన్నది ఒకే మాటని… నాకిన్నాళ్ళు తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటె… నమ్మనంటు ఉంది మనసు…
ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ…
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు… చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
ఈనాడె సరికొత్తగా… మొదలైందా మన జీవితం…
గతమంటూ ఏం లేదనీ… చెరిగిందా ప్రతి జ్ఞాపకం
కనులు మూసుకొని ఏం లాభం… కలై పొదుగా ఏ సత్యం…
ఎటూ తేల్చని నీ మౌనం… ఎటో తెలియని ప్రయాణం…
ప్రతి క్షణం ఎదురయ్యె… నన్నే దాటగలదా…
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు…
చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు…
గాలిపటం గగనానిదా… ఎగరెసే ఈ నేలదా…
నా హృదయం నీ చెలిమిదా… ముడివేసే ఇంకొకరిదా…
నిన్నా మొన్నలన్నీ నిలువెల్లా… నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘంలా… ఆకాశాన నువు ఎటు ఉన్నా
చినుకులా కరగక… శిలై ఉండగలవా…
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు… చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు… చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని… నాకిన్నాళ్ళు తెలుసు…
నువ్వు నేను ఇద్దరున్నామంటె… నమ్మనంటు ఉంది మనసు…
ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ…
Kallaloki Kallu Petti Lyrics in Telugu-Nuvve Kavali – కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు