Menu Close

Kalaga Vachchinavu Song Lyrics In Telugu – Pokiri Raja

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

లలలా ఓ ఓ లలల లలల లలలా
కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
వహవ్వా నచ్చినావు… తహతహ కలిగించినావు
మదనా..! ఓ నా మదనా… మదనా మదనా

కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
యమగా రెచ్చినావు… జలజలజల కురిసినావు
లలనా..! ఓ హో లలనా… లలనా లలనా

అందొచ్చిన అందాలను వదిలెయ్యకు
పొంగొచ్చిన గంగల్లే అల్లెయ్యకు
సరదా పడవా… చెబితే వినవా
మరీ అలా బెట్టెందుకు..?

కలగా వచ్చినావు… మిలమిలమిల మెరిసినావు
లలనా..! ఓ హో లలనా… లలనా లలనా

సరిగా పోల్చుకుని… వరసే తేల్చుకుని
బరిలో దిగాలి గానీ, ఓ ఓ… అయినా ఇదేం పనమ్మీ
సిగ్గే చంపుకొని… అగ్గే దింపమని
అడిగే హక్కున్నదాన్ని, ఓ ఓ.. అలుసైపోయానా సామీ

మాటవరసకైనా మోమాటపెట్టకు నన్ను
మోటుసరసమైనా నిను కాదని అనుకోను
ఎవరనుకొని ఎగబడతవు వదలవే నన్ను

ఈనాడే కాదయ్యా వచ్చే జన్మంలోనైనా
నీ నీడై ఇట్టాగే వెంటే ఉంటాను
అసలు సిసలు ఆడపులిగ దూకకే వామ్మో

కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
మదనా..ఆహ..! ఓ నా మదనా… మదనా మదనా

పాపను కట్టుకుని… పైటను పట్టుకుని
పైపైకొచ్చెయ్యి బావా, ఓ ఓ… రావా మహానుభావా
పోన్లే పాపమని పెదవే అందుకుని
ఒళ్ళో పడాలంటావా… అయ్యయ్యయ్యయ్యో
పాపం చేసేయమంటావా..!!

పడుచుతనము లేదా… అది పొడుచుకు తినలేదా
పదుగురెదుట మీద పడిపోతే మరియాదా
కసి తెలియని పసి మనసువి నువ్వు కావుగా

కళ్యాణం కోసం… కదంతొక్కే కళ్యాణి
వేళొచ్చే దాకా… వేసేయ్ కళ్ళాన్ని
ముసుగు వెనక ముడుచుకొనక బయటపడవయా, హ

కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
యమగా రెచ్చినావు జలజలజల కురిసినావు
మదనా..! ఓ నా మదనా… లలనా లలనా

అందొచ్చిన అందాలను వదిలెయ్యకు
పొంగొచ్చిన గంగల్లే అల్లెయ్యకు
సరదా పడవా… చెబితే వినవా
మరీ అలా బెట్టెందుకు..?

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading