ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
పేగే కదలగా సీమంతమాయెలే… ప్రేమదేవతకు నేడే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
లాలించే తల్లీ, పాలించే తండ్రీ… నేనేలే నీకన్నీ
కానున్న అమ్మా, నీ కంటి చెమ్మ… నే చూడలేనమ్మా
కన్నీళ్ళలో చెలికాడినే… నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
పేగే కదలగా సీమంతమాయెలే… ప్రేమదేవతకు నేడే
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
తాతయ్య తేజం, పెదనాన్న నైజం… కలిసున్న పసిరూపం
నీ రాణితనము, నా రాచగుణము… ఒకటైన చిరుదీపం
పెరిగేనులే నా అంశము… వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నొ తరములు తరగని యశములకు
ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
నడిచే దైవమా నీ పాదధూళులే… పసుపు కుంకుమలు నాకు
ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా