అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Kadhile Nadhila Lyrics in Telugu – Geetha
కదిలే నదిలా నీ కధా
పయనం ఎటుకే అంతలా
ఆకాశమంత మనసే
ఈ విశ్వమంతా పరిచే
ప్రేమగా నీ కలా
విలయాన కొడిగట్టే దీపాలకే
సమురల్లే నీ సాయం అందేనులే
పొద్దే పొడుపే లేని ఆ కళ్ళలో
ప్రభవించిన వెంటనే
ఆకాశమే నీ ఆశయం
ఆనందమే నీ సంతకం
కదిలే నదిలా నీ కధా
పయనం ఎటుకే అంతలా
మౌనం చేసే గీతాలాపం
మమతేనంట తన సందేశం
ఏ జన్మదో ఈ సుకృతం
మీతోటి ఈ అమ్మ కలిసెనే పండుగై ఇలా
గుండెల్లో గాయాలు తుడిచెనే తల్లిగా
సీతాకోకచిలుకల గుంపే
ఏకమైనా ఓ లోకం ఇదే
వేల సైన్యమై నీకు కావలై
గీత కాపు కాచెనే, తొలిగి పోవు బాధలే
కదిలే మదిలే తన కధే
పయనం ఎపుడూ ఆపదే
ఎవరే పాపం పసివాళ్ళంతా
ఎందుకు చేరే నీ చుట్టూత
ఏమున్నదే నీ చెంతలో
ఒక్కొక్క చినుకొచ్చి వాలిన
నదివి నీవుగా
చేసావు సరికొత్త సాగునే పుడమిపై
గరళం మింగి అమృతమిచ్చే
ప్రేమేనంట నీ సన్నిదే
పడమటి నుండి పొడిచే తొలిపొద్దు
నీవేగా ఓ ప్రాణమా… నీ జన్మ చరితార్ధమే
కదిలే నదిలే నీ కధే
పయనం ఎపుడూ ఆపకే.. ..
Kadhile Nadhila Lyrics in Telugu – Geetha